Latest

Loading...

Remdesivir రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Remdesivir


కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు చాలినన్ని నిల్వ ఉన్నాయన్నారు. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా నెల రోజుల్లోనే 20 నుంచి 60కి పెరిగినట్టు చెప్పారు. ఏప్రిల్ 11న రోజుకు 33 వేల వయల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడా సంఖ్య 3.50 లక్షలకు పెరిగిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అత్యవసరాల కోసం మాత్రం కేంద్రం 50 లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను సమకూర్చుకోవాలని నిర్ణయించిందన్నారు. రెమ్‌డెసివిర్‌కు గత నెలలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ యాంటీ వైరల్ ఇంజక్షన్ ధరను తగ్గించిన ప్రభుత్వం రెమ్‌డెసివిర్, దాని తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దిగుమతి సుంకం మాఫీ అమలు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది.

No comments

Powered by Blogger.