Summer drink : శరీరంలో వేడిని 2 నిమిషాల్లో తగ్గించే అద్భుతమైన డ్రింక్ ..
Summer drink In telugu :వేసవికాలం వచ్చేసింది. ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుండి తప్పించుకోవటానికి అందరు కూల్ డ్రింక్స్ త్రాగుతూ ఉంటారు. ఈ ఎండల వేడి నుండి బయట పడటానికి మరియు శరీరంలో వేడి తగ్గటానికి ఇలా కూల్ డ్రింక్స్ తాగటం వలన ఉపయోగం కన్నా అపాయమే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఒక అద్భుతమైన డ్రింక్ తాగితే శరీరంలో వేడి చాలా తొందరగా తగ్గటమే కాకుండా నీరసం,నిసత్తువ వంటివి తొలగిపోతాయి.
ఈ డ్రింక్ ని సబ్జా గింజలతో తయారుచేస్తున్నాం. ఒకప్పుడు వేడి చేసిందంటే సబ్జా గింజల పానీయాన్ని త్రాగేవారు. ఇప్పుడు చాలా మందికి సబ్జా గింజలంటే తెలియదు. శరీరంలో వేడి తగ్గించటానికి సబ్జా గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ఆ డ్రింక్ పేరు సబ్జా లెమన్ డ్రింక్. ఈ డ్రింక్ తయారుచేయడానికి కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.
సబ్జా గింజలు - 2 స్పూన్స్
కళ్లు ఉప్పు లేదా నల్ల ఉప్పు - పావు స్పూన్
ఖండ చక్కర లేదా పంచదార - 3 స్పూన్స్
నిమ్మకాయ - 1
తయారి విధానం
ముందుగా సబ్జా గింజలను అరగంట పాటు నానబెట్టాలి. ఒక పెద్ద బౌల్ లో రెండు కప్పుల నీటిని తీసుకోని దానిలో మూడు స్పూన్ల పంచదార,పావు స్పూన్ కళ్ళు ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను కలపాలి. అంటే సబ్జా లెమన్ డ్రింక్ రెడీ. గ్లాసులో పోసి సర్వ్ చేసుకోవటమే.
No comments