Latest

Loading...

Tirumala Temple: అలిపిరి కాలినడక మార్గం విశిష్టతలివే..! చరిత్ర ఏం చెబుతోందంటే.!

Tirumala tirupathi

 భక్త కౌసల్యుడు, కలియుగ వరదుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు కొలుతువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. శేషాద్రి నిలయంపై వెలసిన శ్రీవారిని కనులారా తిలకించడానికి రోడ్డు నడక మార్గం గుండా విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తులకు అందుబాటులో ఉండేందుకు తిరుమల రాకపోకలకు అముగుణంగా రెండు నడక మార్గాలు, రెండు ఘాట్ రోడ్డులు ఉన్నాయి 1945కి పూర్వం వరకు తిరుమలకు అందుబాటులో కేవలం నడక మార్గం మాత్రమే. శ్రీవారి దర్శనార్థం వెళ్లాలంటే.., అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం గుండా మాత్రమే తిరుమలకు చేరుకోవాలని. కాలక్రమేణా భక్తుల సంఖ్యా పెరగడంతో పాటు కోవిడ్-19 రాకముందు వరకు తిరుమలకు నిత్యం నడక మార్గం గుండా తిరుమలకు యాత్రికులు చేరుకునే సంఖ్య రోజుకు 40వేలు పైమాటే.

ఇప్పుడైతే కరోనా వైరస్‌కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తుల సంఖ్యా తగ్గుముఖం పట్టింది. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి వాళ్లే కాక.. ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి నడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు.


శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉండటంతో అలిపిరి నడక మార్గంపై కప్పును మరమ్మతులు చేయాలనీ నిర్ణయం తీసుకుంది ఇందుకు రిలయన్స్ కార్పొరేషన్ నుంచి రూ.25 కోట్ల రూపాయలు విరాళం లభించింది. పనులను ప్రారంభించిన టీటీడీ అలిపిరి మెట్లమార్గం మరమ్మతులపై ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షా నిర్వహించి ఆరు మాసాల్లో పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. 2020 సెప్టెంబర్ నెలలో టీటీడీ నడకమార్గం మరమ్మతులను ప్రారంభించింది. తక్కువమంది భక్తులు వస్తుండటంతో భక్తులను అనుమతిస్తూ మరమ్మతుల పనులు జరుపుతూ వచ్చింది. పైకప్పు నిర్మాణం చేయాల్సి రావడంతో తాత్కాలికంగా అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

భక్తుల వద్ద నుంచి ఎలాంటి పిర్యాదు రాకున్నా పూర్వం ఎప్పుడో నిర్మించిన షెడ్లు కావడం పెచ్చులు వుడుతూ పడుతుండటంతో 25 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ పూర్తిగా షెడ్లతో పునఃనిర్మాణం పనులు ప్రారంభించింది. పాడైన షెడ్లను తొలగించి నూతన షెడ్లతో పాటుగా భక్తుల విశ్రాంతి తీసుకొనే విధంగా చిన్న షెల్టర్లు, మరుగుదొడ్లు, జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేయనుంది టీటీడీ. జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు పూర్తి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ రికార్డ్స్ ప్రకారం 2010 నుంచి ఇప్పటికి వారలు అలిపిరి నడక మార్గంలో భక్తులను ఆపిన సందర్భాలు లేవు.


2020 మార్చి 20వ తేదీ నుంచి 83 రోజుల పాటు అలిపిరి నడక మార్గాన్ని టీటీడీ మూసివేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అప్పట్లో శ్రీవారి దర్శనంతో పాటుగా రెండు రోడ్డుమార్గాలు, రెండు నడక మార్గాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత 2020 సంవత్సరం జూన్ 11వ తేదీ నుంచి మధ్యాహ్నం 2వరకే భక్తులను అనుమతిస్తూ వస్తోంది టీటీడీ. జూన్ 1వతేది నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తుండటంతో కేవలం శ్రీవారి మెట్ల మార్గం నుంచి భక్తులను కాలిబాటన తిరుమలకు అనుమతిస్తారు.


రాయల వారి కాలంలోనే నడకమార్గం

రాయలవారి కాలంలోనే అలిపిరి నడక మార్గం అభివృద్ధి సాధించిందని శాసనాల ద్వారా తెలుస్తోంది. మిట్ట అనంత రాయల కాలంలో గాలిగోపురం నిర్మాణం జరిగినట్లు చరిత్రలు చెపుతున్నాయి. అప్పట్లో కాలిబాటగానే ఉండేది. 19వ శతాబ్దంలో అభివ్రుద్ధి జరిగినట్లు చెపుతున్నరు. దీనికి సంబంధించి ఎలాటి చారిత్రాత్మక ఆధారాలు లేవు.


అసలు అలిపిరి అంటే అర్థం ఏంటి:

ప్రాచీన కాలంలో అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదమని... పుళీ అంటే చింత చెట్టు అని అర్థం. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడేదని చరిత్ర కారులు చెపుతున్నారు. ఈచెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి.సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడచి వెళ్లే వారు. నడవ లేని వారికి డోలీలు వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీది అది ఈ నాటికి ఉంది. ఆ విధంగా ఆరోజుల్లో సుదూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం.


కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుచుకుంటారు. ఆ దేవదేవుని దగ్గరికి కాలినడకన వెళ్లి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నడకదారిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. భక్తులు నడిచి వెళ్లే దారిలో ఎండకు, వర్షానికి రక్షణ ఇచ్చేలా మూడు దశాబ్ధాల క్రితం టీటీడీ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లు పాతబడడంతో వర్షం వస్తే భక్తులు తడిచే అవకాశం ఉండటంతో.. టీటీడీ కాలిబాటను మరమ్మత్తులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. 7.5 కిలోమీటర్ల దూరమున్న నడక దారిలో చివరి మెట్టు వరకు కూడా భక్తులు తడవకుండా షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నడకదారిపై భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా అక్కడక్కడా బాగా పాడవడం, వర్షం వస్తే భక్తులు తడిచే అవకాశం ఉండటంతో.. నడకదారిని అభివృద్ధి చేయాలని టీటీడీ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టింది. మొత్తం మీద మరో రెండు నెలల్లో భక్తులకు అధునాతన సౌకర్యాలతో కూడిన నడకదారి అందుబాటులోకి రానుంది.

No comments

Powered by Blogger.