Water నీళ్లు తక్కువగా తాగుతున్నారా.. ఆ సమస్యలు వస్తాయంటున్న వైద్య నిపుణులు....?
మనలో చాలామంది తాగే నీళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వేసవికాలంలో మారిన ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ నీటిని తీసుకున్నా మిగిలిన కాలాల్లో మాత్రం ఎక్కువ నీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అయితే తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
మనలో ఎక్కువమందిని మొటిమలు, యాక్నె వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. నీళ్లు ఎక్కువగా తీసుకోని వాళ్లనే ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. కళ్ల కింద ముడతలు, వాపు ఉన్నా ముఖం కాంతివంతంగా లేకపోయినా శరీరంలో నీళ్ల శాతం తక్కువగా ఉందని భావించాలి. ముక్కు ఎర్రబడి ఉన్నా, పొడిగా ఉన్నా శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు అందలేదని భావించాలి. మరి కొంతమంది రోజంతా అలసటతో బాధ పడుతుంటారు.
తగినన్ని నీళ్లు తీసుకోని వాళ్లనే అలసట సమస్య ఎక్కువగా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తున్నా, జుట్టులో జీవం లేకపోయినా శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు అందలేదని భావించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి తగినంత పొటాషియం లభించడంతో పాటు ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ ఉంటే మాత్రమే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
నీళ్లు తాగడం ద్వారా మాత్రమే పొటాషియం, ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు భోజనం చేయడానికి 20 నిమిషాల ముందు నీళ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
No comments