Latest

Loading...

watermelon :పుచ్చకాయను ప్రిజ్ లో పెడుతున్నారా.. ఇది తెలుసుకోం

Watermelon

 ఈ మధ్యకాలంలో రిఫ్రిజిరేటర్ల వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా రిఫ్రిజిరేటర్ వాడుతున్నారు. అయితే రిఫ్రిజిరేటర్ లో కూరగాయలు కాని వివిధ రకాల పండ్లు గాని ఉంచడం వల్ల ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి అని భావిస్తూ ఉంటారు అందరూ. రోజుల తరబడి అలాగే ఉండటం వల్ల ఎక్కడా కూరగాయలు చెడిపోవడం పండ్లు పాడడం లాంటివి జరగవు అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల కూడా ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల కూరగాయలు పండ్లలో ఉన్న సహజ లక్షణాలు కోల్పోయే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.


ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను అయితే ఫ్రిజ్లో అస్సలు పెట్టకూడదు అని సూచిస్తున్నారు నిపుణులు.


అయితే వేసవి కాలంలో విరివిగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో పుచ్చకాయ కు ఎంతో గిరాకీ ఉంటుంది. భగభగ మండే సూర్యుడు నుంచి పుచ్చకాయ తీసుకోవడం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతూ ఉంటారు జనాలు. అందుకే ఎక్కడ చూసినా కూడా రోడ్డుపై వ్యాపారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది పుచ్చకాయ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే వేసవి కాలంలో పుచ్చకాయ తినడం మంచిది కానీ రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచిన పుచ్చకాయ తినడం మాత్రం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.


పుచ్చకాయను అస్సలు రిఫ్రిజిరేటర్ లో పెట్టవద్దు అంటూ సూచిస్తున్నారు ఒకవేళ పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడితే దాని లోని పోషకాలు అన్నీ పోతాయి అంటూ చెబుతున్నారు. అయితే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలితే వాటిని బయట మాత్రం ఉంచకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలిపోతే కేవలం రెండు గంటల్లోనే పాడైపోయే అవకాశం ఉంటుంది ఇలా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పోషకాలు వద్దనుకుంటే పుచ్చకాయ ఫ్రిజ్ లో పెట్టడం బెటర్.



No comments

Powered by Blogger.