Zinc rich foods జింక్ ఉన్న ఫూడ్ ని తీసుకుంటే.. కరోనా ఖతం
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కరోనా ఏదో ఒక రూపంలో మనపై దాడి చేస్తోంది. మాస్క్ పెట్టుకున్నా.. శానిటైజర్ వాడినా, సోషల్ డిస్టెన్స్ పాటించినా.. మహమ్మరి మనుగడను సాగించేందుకు, మానిషిని టార్గెట్ చేస్తోంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఇమ్యూనిటీని బిల్డ చేస్కోవడమే చక్కని మార్గం మరి ఇమ్యూనిటీ కోసం విటమిన్ సీ శరీరానికి చాలా అవసరమని మనందరికి తెలుసు.. కానీ విటమిన్ C తో పాటు జింక్ ను కూడా తగు మోతాదులో యాడ్ చేసుకుంటే అదే మన పాలిట పరమౌషదం.
మనం తీసుకునే ఫూడ్ లో జింక్ లేకపోతే.. ?
మన బాడీకీ జింక్ సరిపడా లేకపోతే.. డయేరియా (అతి మూత్రం) సమస్య వస్తుంది. మనిషి ఎదుగుదల ఆగిపోతుంది, జుట్టు రాలడం, కళ్లు, చర్మం దెబ్బతింటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోజూ మగవాళ్లకు 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అవసరం.
అయితే జింక్ ఎక్కవగా దొరికే ఫూడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ సీ శరీరంలోని కణాలకు శక్తినిస్తుంది. తద్వారా ఎలాంటి వైరస్ తో నైనా పోరాడే శక్తిని కణాలు కలిగి ఉంటాయి. కరోనా లాంటి ఖతర్నాక్ వైరస్ ను కూడా చంపి పాతరేయడంలో విటమిన్ సీ పాత్ర కీలకం. అయితే జింక్ కూడా ఇదే స్ధాయిలో ఎలాంటి వైరస్ నైనా చంపడంలో కీ రోల్ ప్లే చేస్తుంది.జింక్ కోసం మనం జింక్ టాబ్లెట్లు వాడుతుంటాం. ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. వాటి బదులు జింక్ ఉండే ఫూడ్ తీసుకున్నట్లయితే.. మన స్కిన్, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మంచిది.
శనగల్లో జింక్ అధికం
శనగల్ని మన దేశంలో బాగానే వాడుతారు. జింక్ కావాలి అనుకునేవారు శనగలు తప్పక తీసుకోవాలి. శనగల్లో జింక్‌తోపాటూ.. ఐరన్, సోడియం, సెలెనియం, మాంగనీస్, రాగి ఉంటాయి. ఓ కప్పు ఉడికించిన శనగల్లో ఫైబర్, ప్రోటన్, 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.గింజల్లో కూడా జింక్ బాగా ఉంటుంది. పైగా వీటిలో ఫ్యాట్ తక్కువ. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. కప్పు గంజల్లో 4.7 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. మీరు వండే కూరల్లో వీటిని ఎక్కువగా వేసుకోండి.
గుమ్మడి గింజల్లోనూ..
గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్ ఉంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.2 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8.5 మిల్లీగ్రాములు ఉంటాయి. గుమ్మడికాయ గింజల్ని తరచూ తింటూ ఉంటే.. కేన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశోధన తెలిపింది. జింక్ లోపం ఉన్నవారు.. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే చాలా మంచిది.
పుచ్చకాయ గింజల్లో పోషకాలు
తర్బూజా గింజల్లో జింక్, మాక్రోన్యూట్రియంట్స్ శాతం ఎక్కువ. తక్కువ మోతాదులో ఈ గింజలు తిన్నా 4 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. బ్లాక్ బీన్స్‌లో జింక్ శాతం ఎక్కువ. ఇవి కరిగిపోయే, కరగని ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, పాస్పరస్, కాల్షియం వంటివి ఇందులో ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఓ కప్పు వండిన బీన్స్‌లో 0.9 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.
ఫ్యాట్ లేని పెరుగులో
ఫ్యాట్ ఎక్కువగా లేని పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన పొట్టలో చేరి… కావాల్సినంత జింక్ అందిస్తుంది. ఓ కప్పు పెరుగులో 1.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
కప్పు ఓట్స్ లో 1.3 మిల్లీ గ్రాముల జింక్
ఈ రోజుల్లో ఓట్స్ చాలా మంది వాడుతున్నారు. వీటిని వండుకోవడం చాలా తేలిక. వీటిలో జింక్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ B6, బీటా గ్లూకాన్ వంటి పోషకాలు ఉంటాయి. కప్పు ఓట్స్ లో 1.3 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
No comments