Latest

Loading...

Aamir khan మా కుటుంబం దివాళా తీసింది: అమీర్‌ఖాన్

Aamir khan

 అమీర్‌ఖాన్‌..బాలీవుడ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరో. ప్రస్తుతం స్టార్ డమ్ తోపాటు కావాల్సినంత డబ్బు ఉంది. అమీర్ ఖాన్ తండ్రి, అంకుల్ అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్స్. అయితే తన తండ్రి పేద నిర్మాత అని, ఎలాంటి డబ్బు సంపాదించలేదని అమీర్ ఖాన్ చెప్పాడు. చిట్ చాట్ సెషన్ లో అమీర్‌ఖాన్ మాట్లాడుతూ..నాన్న సినిమాలంటే చాలా ఆసక్తి కలిగిన నిర్మాత. కానీ సినిమాను బిజినెస్ ఎలా చేయాలో ఆయనకు తెలియదు.


అందువల్ల ఆయన ఎలాంటి డబ్బు సంపాదించలేదు. నాన్న తీసిన సినిమాల్లో ఒకటి పూర్తి చేయడానికి ఎనిమిదేళ్లు పట్టింది. మరో సినిమా పూర్తి చేసేందుకు మూడేళ్లు పట్టింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ సమయంలో మేము దాదాపు దివాళా తీసాము.

మా కుటుంబం రోడ్డుపైకి వచ్చిందంటూ తన ఫ్యామిలీ పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు అమీర్‌ఖాన్. ప్రస్తుతం లాల్ సింగ్ చధా సినిమాలో నటిస్తున్నాడు అమీర్‌ఖాన్.


No comments

Powered by Blogger.