Latest

Loading...

Anandaiah Medicine: తిరుపతిలో ఆనందయ్య మందు తయారీ.. ఇంటింటికి పంపిణీ...

Anandaiah Medicine

 కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎంత మందికి ఇస్తారు? ఏపీ, తెలంగాణలో ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. కానీ మందు పంపిణీపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఐతే ఆదివారం పరిమిత సంఖ్యలో కొంత మందికి మందును పంపిణీ చేశారు. ఆనందయ్య సోదరుడి ఆధ్వర్యంలో మందు పంపిణీ జరిగింది. రేపటి నుంచి మిగతా పూర్తి స్థాయిలో మందు పంపిణీ జరుగుతుందని ఆనందయ్య అనుచరులు చెప్పారు. మొదట సర్వేపల్లి ప్రజలకు మాత్రమే ఇస్తారు. మందుకోసం వచ్చిన వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఐతే రోజుకు 2వేల కంటే ఎక్కువ మందికి ఇవ్వలేనని ఆనందయ్య చెప్పినట్లు తెలుస్తోంది.


మరోవైపు తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు తయారీని పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపరు.


''చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో లక్షాల 60వేల కుటుంబాలున్నాయి. 5లక్షల 20వేల మంది ప్రజలున్నారు. ఒక ఇంటిలో 5 మందికి సరిపడా మందును ఇస్తాం. కరోనా రాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచే P మందు (ప్రివెంటివ్ మెడిసిన్) మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నాం. చుట్టుపక్కల పల్లెల నుంచి వనమూలికలు తెప్పించాం. అరకు నుంచి తేనెను తీసుకొచ్చాం. మందు తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. బఠాణి గింజంత సైజులోనే మందు ఇస్తాం. ఒక్కొక్కరు రెండు పూటలు వేసుకోవాల్సి ఉంటుంది. నా నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఉచితంగానే పంపిణీ చేస్తాం. ఎవరికీ ఇక్కడకు రాకూడదు. ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి మేమే ఇంటింటికీ పంచుతాం. సీఎం జగన్ అనుమతులతోనే మందును తయారీ చేస్తున్నాం.'' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.



No comments

Powered by Blogger.