anandayya medicine రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. వీరికి మాత్రమే....!
రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనందయ్య శిష్యులు చేస్తున్నారు. మందు పంపిణీ కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అని, ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.
గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు.
మరో పక్క మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని అధికారులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు. ఇక తనని రాజకీయాల్లోకి లాగవద్దని ఆనందయ్య కోరారు.
No comments