Anandayya medicine : ఆనందయ్య మందు వాడానన్న జగ్గూ భాయ్.. కరోనా రాలేదంటూ..
ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై సినీ నటుడు జగ్గూ భాయ్ మరోసారి స్పందించాడు. తాను ఆనందయ్య మందు వాడానని, తనకు కరోనా రాలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన ఈ మందుపై మొదటి నుంచి రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ మందు వల్ల కరోనా తగ్గే అవకాశం లేదని, కొందరంటే మరికొందరేమో ఈ మందు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ వస్తుందంటూ ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వ ఆమోదం లభించడంతో కొంత మేర ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు స్పందిస్తూ.. తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు.
ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒకడినని. తనకు కరోనా రాలేదని ఆయన స్పష్టం చేశారు.
No comments