Latest

Loading...

Anandayya ఆనందయ్యకు సముచిత గౌరవం.. వరల్డ్ బుక్‌లో చోటు...?

Anandayya

 దేశంలో లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు మందు కనిపెట్టిన కృష్ణపట్నం ఆనందయ్యకు తమ సంస్థ ద్వారా త్వరలో వరల్డ్‌బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ బ్రాహ్మిన్స్‌ పార్లమెంట్‌(ఐబీపీ) రాష్ట్ర కార్యదర్శి దినవహి వెంకటనాగరాజ ప్రసాద్‌ ప్రకటించారు. ఆదివారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలుకు వచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నివారణకు మందు కనిపెట్టి ఆనందయ్య చేస్తున్న సేవలను ఐబీపీ గుర్తించిందన్నారు. త్వరలోనే ఆనందయ్యకు, ఆయన్ను ప్రోత్సహించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి లండన్‌ నుంచి రానున్న అవార్డులను నెల్లూరులో అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐబీపీ సభ్యురాలు సునీత ఉన్నారు.


No comments

Powered by Blogger.