Ap curfew : ఏపీలో ఉదయం పూట కర్ఫ్యూ ఆంక్షల ఎత్తివేత...!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు ఇస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 20 నుండి కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు.
కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే సడలింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే సడలింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
No comments