AP: ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు రద్దు...!!
ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
No comments