Banana: అరటిపండ్లు రాత్రి సమయాల్లో తినొచ్చా.. లేదా..?
అరటిపండును రాత్రి సమయాల్లో తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. తినొచ్చని చెప్తున్నారు ఆహార నిపుణులు.
కాకపోతే.. నిద్రకు వెళ్లబోయే రెండు గంటల ముందు మాత్రమే అరటిపండ్లు తినొచ్చు. రెండు గంటలలోపు మాత్రం వద్దు అంటున్నారు. అరటి పండులో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తుందనేది నిజం. కానీ.. రాత్రిళ్లు అరటిపండు తింటే దగ్గు, జలుబు.. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయనేది ఓ వాదన. మధుమేహం ఉన్నవారు అరటిపండ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
నిద్రకు రెండు గంటల ముందు తింటే రాత్రి సుఖవంతమైన నిద్ర పడుతుందని అంటున్నారు. అరటిలోని మెగ్నీషియమ్, అమినో యాసిడ్ వల్ల ఈ ఉపయోగం ఉంటుందని అంటున్నారు. అరటిపండ్లు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అరటి పళ్లలో కార్బోహైడ్రెట్ల స్థాయి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. అరటిలో పొటాషియం ఉండటం వల్ల కండరాలను బలోపేతం చేస్తుంది. ఎముకలు, దంతాల బలోపేతానికి మంచిది. మలబద్దకం ఉన్నవారికి అరటిపండు ఎక్కువగా తింటే ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందులోని ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది.
బాగా పండిన అరటిపండుని తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. వారానికి 2-3 అరటి పండ్లు తింటే మహిళలకు కిడ్నీ సమస్యలు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. తొక్కలపై మచ్చలున్న అరటి పండు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. తొక్కపై ఉండే ముదురు రంగు మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్‌ను ఏర్పరిచి క్యాన్సర్, శరీరంలో పేరుకుపోయిన అసంబద్ద కణాలను చంపడంలో దోహదపడతాయి.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం
No comments