Bank Privatisation: ప్రైవేటీకరణలో భాగంగా అమ్మకానికి మరో రెండు బ్యాంకులు...!!
Bank Privatisation:
బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మకానికి ఉంచనున్నట్లు సమాచారం. రెగ్యులైజేషన్స్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లా యాక్ట్‌కు సవరణలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు నీతిఅయోగ్ ఇప్పటికే రెండు బ్యాంకులను షార్ట్ లిస్ట్ చేసి కేంద్రానికి నివేదిక పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సమాచారం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల ప్రైవేటీకరణ ఉంటుందని వివరించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగినప్పటికీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది.
శాలరీలు, పే స్కేల్, పెన్షన్ లాంటి కీలక అంశాలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ బ్యాంకు ఉద్యోగుల కోసం వీఆర్ఎస్ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
No comments