Bill gates దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉందో తెలిస్తే...షాక్ అవ్వడం ఖాయం...!!
బిల్‌గేట్స్ అనగానే.. ఆయన బాగా ధనవంతుడు, అభినవ దానకర్ణుడు అనే విషయాలు గుర్తుకొస్తాయి. అయితే ఆయనకు సంబంధించిన మరొక ప్రత్యేకత చాలా మందికి తెలియదు. యూఎస్‌లో ప్రైవేట్ ఫామ్‌ల్యాండ్ ఉన్న వ్యక్తి బిల్ గేట్సే కావడం విశేషం. అంతేకాదు మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వాడే బంగాళాదుంపలను ఆ పొలంలోనే పండిస్తారట. అంతరిక్షం నుంచి చూస్తే బిల్‌గేట్స్ పొలం చాలా పెద్దగానే కనిపిస్తుందట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... ఎంత పెద్ద పొలం బిల్ గేట్స్‌కు ఉందో.
బిల్ గేట్స్‌కు అమెరికాలోని 18 రాష్ట్రాల్లో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. యూఎస్‌లో అత్యంత ఎక్కువ ప్రైవేట్ పొలం ఉన్న వ్యక్తిగా బిల్‌గేట్స్ నిలిచాడు.
ఈ భూమి గురించి ఇప్పుడు ఎందుకు చర్చ వచ్చింది అంటే... ఇటీవల బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ ప్రైవేట్ భూమి విషయం స్క్రూట్నీ కిందకు వచ్చింది. బ్లూమ్‌బర్గ్ ఎస్టిమేట్స్ ప్రకారం... ప్రస్తుతం బిల్ గేట్స్ 144 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.
గేట్స్ దంపతులు విడాకులు తీసుకోవడంతో మెలిందా గేట్స్ ప్రపంచ మహిళా ధనికుల జాబితాలో స్థానం సంపాదిస్తారు. విడాకుల నేపథ్యంలో బిల్, మెలిందా సపరేషన్ కాంట్రాక్ట్ ద్వారా ఆస్తిని పంచుకుంటారట. ఇదంతా కోర్టు బయటే జరుగుతుందని సమాచారం. దీని కోసం వీరు ముందుగా ప్రెనుప్షియల్ అగ్రిమెంట్ చేసుకోకపోవడమే దీనికి కారణం.
బిల్‌గేట్స్‌కు చెందిన మొత్తం 2,69,000 ఎకరాల్లో ఏమేం పండిస్తారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ, అక్కడ ఎక్కువగా బంగాళాదుంపలు పండిస్తారని మాత్రం తెలుస్తోంది. అవన్నీ మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్తాయట. మెక్‌డొనాల్డ్స్‌లో దొరికే ఆలూ ఫ్రైస్‌ను మనం ఇకపై ఏమంత దీమాగా చూడక్కర్లేదేమో. ఎందుకంటే అవి బిల్ గేట్స్‌కు చెందిన పొలంలో పండుతున్నాయి. అయితే అక్కడ పండే ఆలుగడ్డలు కేవలం యూఎస్ లోని మెక్‌డొనాల్డ్స్‌కు మాత్రమే సరఫరా చేస్తున్నారా? లేక ఇతర దేశాలకు పంపిస్తున్నారా అనేది తెలియదు.
No comments