Bird flu in China : చైనాలో ఊపిరిపోసుకున్న మరో మహమ్మారి..?
చైనా.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రపంచం వణుకుతోంది. వైరస్ల కర్మాగారంగా ఈ దేశం మారిపోయింది. ఇప్పటికే ఈ చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇక ఇప్పుడు చైనా నుంచి మరో మహమ్మారి రాబోతోందా.. మరోసారి ప్రపంచం తల్లడిల్లబోతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. తాజాగా చైనా నుంచి మరో షాకింగ్ వైరస్ వెలుగు చూసింది.
చైనాలో తొలిసారి ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందట. ఈ విషయం చైనా దేశ నేషనల్ హెల్త్ కమిషన్ స్వయంగా వెల్లడించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ కేసు నమోదైందట. జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ హెచ్10ఎన్3 సోకింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడిని డిశ్చార్జ్ చేయడానికి అనుకూలమైన సామర్థ్యం ఉన్నదని ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్ టీవీ తెలిపింది.
అయితే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కొత్తదేమీ కాదు.. ఇది ఎక్కువగా పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించింది. కొన్ని పక్షుల్లో ఈ వైరస్అధికంగా కనిపిస్తుంది. కానీ ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో కరోనా వైరస్ కూడా అంతే.. గబ్బిలాల్లో కనిపించే వైరస్ మనుషులకు సోకింది. ఇప్పడు మరోసారి ఆ కథ రిపీటవుతుందా అన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి.
చైనా మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌తో భయపడాల్సిందేమీ లేదంటోంది. అప్పుడప్పుడు అరుదుగా ఇలాంటి కేసులు పౌల్ట్రీ ఇండస్ట్రీల్లో పనిచేసే వారిలో కనిపిస్తుంటాయని చైనా చాలా తేలిగ్గా చెబుతోంది. ఇది మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువ అంటోంది. మే 28న ఈ కేసును గుర్తించారు. అయితే చైనా మాటలు నమ్మలేం. గతంలో కరోనా వైరస్ అప్పుడు కూడా ఇవే కథలు వినిపించింది చైనా. ఎందుకైనా మంచిది. అన్ని దేశాలు తగిన జాగ్రత్తలో ఉండటం బెటర్.
No comments