BIS Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే....!!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 28 ఖాళీలను ప్రకటించింది. సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bis.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 28
సివిల్ ఇంజనీరింగ్- 13
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 2
ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్- 2
కెమిస్ట్రీ- 7
టెక్స్టైల్ ఇంజనీరింగ్- 4
BIS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాల
దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 25
విద్యార్హతలు- సంబంధిత ఇంజీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. 2021 జూన్ 25 నాటికి గేట్ స్కోర్ తప్పనిసరి. కెమిస్ట్రీ పోస్టుకు నేచురల్ సైన్సెస్ లేదా కెమిస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 2021 జూన్ 25 నాటికి 30 ఏళ్ల లోపు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- గేట్ 2019, గేట్ 2020, గేట్ 2021 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యు నిర్వహిస్తారు.
వేతనం- రూ.87,525
BIS Recruitment 2021: దరఖాస్తు విధానం
అభ్యర్థులు ముందుగా https://bis.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Career Opportunities పైన క్లిక్ చేయాలి.
Recruitment advertisement/Results లింక్ పైన క్లిక్ చేయాలి.
అందులో సైంటిస్ట్ బీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది.
View క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
నోటిఫికేషన్ చదివిన తర్వాత Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments