Black fungus రాష్ట్రంలో 1784 మందికి బ్లాక్ ఫంగస్...
బెంగుళూరు: రాష్ట్రంలో 1784 మందికి బ్లాక్‌ఫంగస్ సోకిందని, వీరిలో 62 మంది కోలుకున్నారని, మిగిలినవారు చికిత్సలు పొందుతున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. శనివారం సీవీ రామన్ ఆసుపత్రిలో 77 ఐసీయూ పడకలు, ఆక్సిజన్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో 1784 మం దికి బ్లాక్‌ఫంగస్ రాగా 1564 మంది చికిత్సలు పొందుతున్నారన్నారు. కనీసం రెండుమూడు వారాల పాటు చికిత్స అవసరమని, సంపూర్ణంగా కోలుకోవాలంటే ఐదారు వారాలు చికిత్స అవసరమన్నారు. ఇప్పటి వరకు 111 మంది మృ తి చెందారన్నారు. బ్లాక్‌ఫంగస్ బాధితులకు యాంపోటెరిసిన్-బి ఇంజెక్షన్లు అవసరమని కేంద్రం 9,750 వయల్స్ రా ష్ట్రానికి కేటాయించిందన్నారు.
వీటిలో 8,860 వయల్స్ శుక్రవారం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా వయల్స్ అందుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా బ్లాక్ ఫంగ్‌సకు ఉచితంగా చికిత్సలు అందిస్తామన్నారు. బ్లాక్‌ఫంగస్ బాధితులకు రూ.2-3 లక్షల వరకు ఖ ర్చు కానుందని, దానిని ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
సీవీ రామన్ ఆసుపత్రిలో 77 పడకలు సిద్ధం చేశామన్నారు. సీఎ్‌సఆర్‌లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసీయూ పడకలు సిద్ధం చేస్తున్నామన్నారు. డీఆర్డీఓ సంస్థ వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్‌ను సిద్ధం చేసిందని, వంద పడకలకు సరిపోతుందన్నారు. త్వరలోనే సీఎం ప్రారంభిస్తారన్నారు.
No comments