దేశంలో కరోనా మహమ్మారితో పాటు బ్లాక్ ఫంగస్ అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ఇటీవల చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందన్న వార్తల్లో నిజం లేదని, ఈ ఇన్ఫెక్షన్ కోళ్ల నుంచి మనుషులకు సోకుతుందన్న దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. అందువల్ల నిస్సందేహంగా చికెన్ తినవచ్చని ట్వీట్ లో స్పష్టం చేసింది
No comments