Black fungus ఫ్రిడ్జ్, మాస్క్‌లతో బ్లాక్ ఫంగస్ దాడి..!!
దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూ భయపెడుతున్నాయి. కరోనా సోకిన రోగుల్లో స్టెరాయిడ్లు, డయాబెటిస్, ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వల్ల బ్లాక్ ఫంగస్‌కు గురవుతున్నారని వైద్యులు చెప్తున్నారు. అయితే, ఈ ఫంగస్ వ్యాప్తికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని వారు సెలవిస్తున్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతోపాటు ఇంట్లోని రిఫ్రిజిరేటర్లలో ఉంచే ఆహారాల వల్ల, అపరిశుభ్ర మాస్క్‌లను వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో తేల్చారు.
పర్యావరణం ప్రతికూల ప్రభావం, వాతావరణంలో మార్పుల వల్ల బ్లాక్ ఫంగస్ సమస్య కూడా పెరుగుతున్నది. ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆహార పదార్థాలను రోజుల తరబడి అలాగే ఉంచేందుకు ఉపయోగించే గ్యాస్ వల్ల ఈ ఫంగస్ వ్యాప్తి చెందడానికి కారణమని పీజీఐ మెడికల్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ అరుణలోక్ చక్రవర్తి తెలిపారు.
ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచి వేడి చేసిన ఆహారా పదార్థాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కనిపించినట్లు అరుణలోక్ చక్రవర్తి చెప్పారు. రిఫ్రిజిరేటర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా మంచిదని ఆయన సూచిస్తున్నారు.
చాలా మంది ప్రజలు ఒకే మాస్క్‌ను రెండు, మూడు రోజుల పాటు ఉతక్కుండా నిరంతరం వినియోగిస్తున్నారు. ఇలా అపరిశుభ్ర మాస్క్‌ల వాడకం కారణంగా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెప్తున్నారు. నిత్యం మాస్క్‌లను శుభ్రపరుచుకోవడం, మెడికల్ మాస్క్‌లను నిత్యం మార్చుకోవడం వల్ల ఈ ఫంగస్ నుంచి దూరంగా ఉండొచ్చంటున్నారు వైద్యులు.
రక్షణ కోసం ఇవి పాటిద్దాం..
బ్లాక్ ఫంగస్‌ను నివారించడానికి ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో తెరిచి ఉంచకుండా ఉండకుండా చూడాలి.
ఆహారం, పానీయాలను ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లలో ఉంచకూడదు. ఓపెన్ చేసిన బ్రెడ్ ఉంచకూడదు. పాలు, పెరుగు, మిగిలిపోయిన ఆహారాన్ని దాచవద్దు.
ఆహారం, పానీయాలలో ఫంగస్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. రిఫ్రిజిరేటర్లో ఒకే చోట పెద్ద మొత్తంలో ఆహారం, పానీయం ఉంచడం వల్ల ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది.
వైద్య శాస్త్రం ప్రకారం, బ్లాక్ ఫంగస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించదు.
No comments