Latest

Loading...

Black pepper benefits : కొంచెం చాలు... ఆరోగ్యానికి ఎంతో మేలు...!

 

కొంచెం చాలు... ఆరోగ్యానికి  ఎంతో మేలు!

ఫ్రూట్‌ సలాడ్లు, ఆమ్లెట్‌, రైతా... ఇలా రకరకాల వంటకాల్లో మిరియాల పొడిని కాసింత తప్పకుండా వేసుకుంటాం. కొద్దిగా వాడినా దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.

* మిరియాల్లోని 'పెపరిన్‌' అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

* మిరియాలు దగ్గును కూడా తగ్గిస్తాయి.

ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు మిరియాల పాలు, చారు లాంటివి తీసుకోమంటుంటారు పెద్దవాళ్లు. మిరియాల పొడి, తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

* పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధిక ఆకలిని నియంత్రిస్తాయి.

* మోకాళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.



No comments

Powered by Blogger.