పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జులై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అఫిడవిట్లో పేర్కొంది. ఆ మేరకు ఏపీ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని, పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచిన ప్రభుత్వం… కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
No comments