BSF Recruitment 2021: బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే...!!
నిరుద్యోగులకు శుభవార్త. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఎయిర్ వింగ్, పారామెడికల్, వెటర్నరీ పోస్టులున్నాయి. ఈ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF. పారామెడికల్, వెటర్నరీ పోస్టులకు ఒక నోటిఫికేషన్, ఎయిర్ వింగ్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ https://bsf.gov.in లేదా రిక్రూట్మెంట్ వెబ్సైట్ https://rectt.bsf.gov.in/ లో తెలుసుకోవచ్చు.
ఈ వెబ్సైట్లలో డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి.
BSF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు- 170
పారామెడికల్ సిబ్బంది- 75
ఎస్సై (స్టాఫ్ నర్స్) నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్- 37
ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 1
ఏఎస్సై (ల్యాబరేటరీ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 28
సీటీ (వార్డ్ బాయ్, వార్డ్ గాళ్, ఆయా) గ్రూప్ సీ పోస్ట్- 9
No comments