Cinnamon benefits :డయాబెటిస్ కి చెక్ పెట్టె దాల్చిన చెక్క.ఎలా తీసుకోవాలంటే.!?
Home remedies for diabetes :డయాబెటిస్ అనేది ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం అది మనతోనే ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో మధుమేహం సమస్య వస్తుంది. ఇటీవల జరిగిన పరిశోధనలో దాల్చిన చెక్క డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అని తేలింది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఒకవేళ దాల్చిన చెక్క పొడి లేకపోతే ఒక గ్లాసు నీటిలో దాల్చినచెక్క ముక్కలను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.
దాల్చిన చెక్కలు ఇంకా అదనంగా ప్రయోజనాలు ఉన్నాయి అధిక బరువు సమస్య ఉన్నవారు మరియు కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి చాలా చక్కగా పనిచేస్తుంది.దగ్గు జలుబు ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.నోటి దుర్వాసన తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క లో ఉండే గుణాలు దంత సమస్య లేకుండా చేస్తుంది.
No comments