Coffee benefits : కాఫీతో కాలేయ వ్యాధులు దూరం....!!
లండన్: కాఫీ తాగేవారు కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. రోజుకు 3-4 కప్పుల కాఫీని తీసుకునేవారిలో ఈ ప్రయోజనం మరింత అధికంగా ఉంటున్నట్లు నిర్ధారించింది. బ్రిటన్‌లోని సౌథాంప్టన్ విశ్వవిద్యాలయం, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. మొత్తం 4.95 లక్షల మందిపై సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కాఫీ తాగే అలవాటు లేనివారితో పోలిస్తే.. కాఫీ తాగేవారు కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు 21% తక్కువగా, ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే ముప్పు 20% తక్కువగా ఉందని గుర్తించారు. కాఫీ ప్రియులు కాలేయ వ్యాధులతో మృత్యువాతపడే అవకాశాలూ 49% తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.
కెఫీన్‌తో కూడిన, కెఫీన్ లేని కాఫీల్లో ఏది తాగినా ఈ విషయంలో ఒకేరకమైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
No comments