Corona 3rd wave థర్డ్ వేవ్‌లో పిల్లలు జాగ్రత్త : ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయవద్దు...!
ముఖ్యంగా రెండు మూడ్రోజులకంటే అధికంగా జ్వరం రావడం, దాంతోపాటు చలి ఇతర లక్షణాలు కనపడటం, అలిసిపోవడం, బద్ధకంగా ఉండి సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. తల, ఒంటి నొప్పులు, తరచూ దగ్గు రావడం, సరిగా నిద్రపోకపోవడం, అయోమయం, గుండెవేగంలో మార్పులు అంశాలు కూడా గమనించాలి. శరీరంపై మచ్చలు కనిపించినా, పెదవులు, గోళ్లు పాలిపోయినా, ముదురు నీలంరంగులోకి మారినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. నీళ్ల విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, ఊపిరి తీసుకోవడంలో మార్పులు గుర్తించిన వైద్యున్ని కలవాల్సిందే. ప్రధానంగా గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందనే అంశం దృష్టిలో ఉంచుకుని లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించాలి.
సహజంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి కరోనా తీవ్రత అంతగా ఉండకపోవచ్చు. పెద్దల మాదిరిగానే పిల్లలు సైతం కరోనా వ్యాప్తి కారకులుగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు.
No comments