Corona recovery కరోనా నుండి కోలుకున్న ... వెంటాడుతున్న మూడు వ్యాధులు ఇవే...
ఆయాసం, ఛాతిలో నొప్పికి గల కారణం ఏమిటి? వీటి ద్వారా ఇంకా ఏమైనా ముప్పు ఉందా?
కరోనా నుంచి కోలుకున్నవారిలో గుండెపోటుకు కారణం?
సాధారణంగా గుండెపై కలిగే ఒత్తిడే గుండెపోటుకు దారితీస్తున్నది. కరోనా సమయంలో ఇది మరింత ఎక్కువైంది. శరీరంపై ఒత్తిడి పెంచడమే వైరస్ ప్రధాన లక్షణం. ఈ ఒత్తిడి కారణంగా కణాల్లో రక్తం గడ్డకడుతుంది. అంటే ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువవుతుందో అప్పుడు శరీరంలో క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. అది గుండెపోటుకు దారి తీస్తుంది.
దాన్నుంచి కాపాడుకొనే పరిష్కారం ఏంటి?
షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాటగిరీలకు చెందినవారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కచ్చితంగా 'హై సెన్సిటివ్ ట్రోపోనెంట్ టెస్ట్’ చేయించుకోవాలి. దీని ద్వారా గుండెపై ఒత్తిడిని తెలుసుకొనే వీలుంటుంది. ఒకవేళ గుండెపై ఒత్తిడి పెరిగితే ట్రోపోనెంట్ లెవల్స్ పెరుగుతాయి. ఇదే జరిగితే భవిష్యత్‌లో వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించి ముందుగానే మందులు వాడితే ప్రమాదం నుంచి బయట పడొచ్చు. సివియర్ కొవిడ్ అంటే కేవలం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికి ముందు జాగ్రత్తనే మందు.
ఆయాసం, ఛాతిలో నొప్పి ఎందుకు?
కోలుకున్నవారిలో చాలా మంది ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కగానే, చిన్న పని చేయగానే ఆయాసపడిపోతున్నారు. ఛాతిలో మంట, నొప్పితో బాధపడుతున్నారు. ఇది కూడా వారి శరీరంపై కరోనా వల్ల కలిగిన ఒత్తిడే కారణం. ఇలాంటి లక్షణాలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి సీటీ స్కాన్ చేస్తే అంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ లోపల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తున్నవారిలో చాలా మందికి హై బీపీ ప్రమాదం పొంచి ఉన్నది. నా వద్దకు వచ్చే చాలా మందిలో ఈ లక్షణం కనిపిస్తున్నది.
స్టంట్స్ వేసుకున్నవారు, ఇతర గుండె సంబంధిత వ్యాధులున్నవారు టీకా వేసుకోవచ్చా?
ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని కాపాడేది వ్యాక్సిన్ మాత్రమే. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. స్టంట్స్ వేసుకున్నవారు, ఇతర గుండె సంబంధిత వ్యాధులున్నవారు నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్నవారు కూడా నిర్భయంగా టీకా వేసుకోవచ్చు. గుండె జబ్బు, ఇతర వ్యాధులున్నవారు ముందు జాగ్రత్తగా కరోనా టీకాతోపాటు న్యుమోనియా, ఇన్ఫ్లుయెంజాకు వ్యాక్సిన్ తీసుకోవాలి. దీని వల్ల గుండెకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఈ రెండు వ్యాక్సిన్లు అందరికీ అవసరం లేదు.
కోలుకున్నవారిలో మేజర్‌గా వచ్చే ఇబ్బంది ఏమిటి?
కరోనా నుంచి కోలుకున్నవారిలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి సెట్ కావడానికి 3- 6 నెలల సమయం పడుతుంది. కొవిడ్ వచ్చిన వాళ్లలో దాదాపు అందరిలో బీపీ ఉంటుంది. ఇది మేజర్ ప్రాబ్లమ్. 30- 50 ఏండ్ల వయస్సు గల వారిలో ఇది ఎక్కువగా ఉన్నది. అంటే సివియర్ లక్షణాలతో కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్తగా బీపీ వస్తున్నది.
కోలుకున్నవారికి ఎలాంటి కొత్త సమస్యలు వస్తున్నాయి?
నేను గమనిస్తున్నవారిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రధానంగా మూడు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా దాంతోపాటు రోగాల ప్యాకేజీని తీసుకొస్తుంది.
ఆయాసం, ఛాతిలో నొప్పి..
కొవిడ్ తర్వాత ఎవరికైతే ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తుందో వారిలో చాలా మందికి హై బీపీ ఉంటున్నది. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి మందులు వాడుకోవడం మంచిది.
హై బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్..
మనం మామూలుగా కొలెస్ట్రాల్ లెవల్స్ చెక్ చేయం.. కొవిడ్‌కు కొలెస్ట్రాల్ లెవల్స్‌కు ఏం సంబంధం అనుకుంటాం. కరోనా అంటే ఇన్ఫెక్షన్.. కొలెస్ట్రాల్ ఆహారం ద్వారా ఉత్పత్తి అవుతుంది అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనషి శరీరంపై ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు ఆటోమెటిక్‌గా శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతున్నాయి.
బ్లడ్ షుగర్స్ పెరుగుతున్నాయి..
స్టెరాయిడ్స్ వాడినా, వాడకపోయినా బ్లడ్ షుగర్ పెరుగుతున్నది. కరోనా కారణంగా శరీరంపై ఒత్తిడి పెరిగి అప్పటివరకు శరీరంలో కనిపించకుండా ఉన్న బ్లడ్ షుగర్‌ను బయటకు తెస్తుంది. కాబట్టి కరోనా వచ్చినవారికి బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చాలా ముఖ్యమైంది. వీటిని ముందుగానే గుర్తించాలి. ఇందుకోసం ఎప్పటికప్పుడు ఈసీజీ, ట్రోపో వంటి పలు టెస్టులు చేయించుకోవాలి. మంచి ఆహారం తీసుకున్నా.. వ్యాయామం చేసినా ఈ సమస్యలు తీరవు. కేవలం పరీక్షలు చేయించుకొని.. వాటిని గుర్తించి తగిన మందులు వాడటమే పరిష్కారం
No comments