Corona third wave ఏ వయసు పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా..?
సాధారణంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే ఇవి అభివృద్ధి చెందుతాయి. వయస్సు పెరిగే కొద్ది రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల, చిన్నపిల్లలకు వైరస్ సంక్రమణ ప్రమాదం చాలా తక్కువ. ఒకవేళ, కరోనా సోకినప్పటికీ, వారు మరణించే అంత ప్రమాదం ఉండదు. కరోనా సంక్రమణకు అడ్డుగా నిలిచే దీనిని కణాలను యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అని పిలుస్తారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం యువతపై ఎక్కువ పడిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపితే, సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మూడో వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, మూడో వేవ్ ఎఫెక్ట్ ఏ వయసువారిపై అధికంగా ఉంటుంది అనే విషయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడోదశ కరోనా ప్రభావం 13 ఏళ్ల వయసులోపున్న పిల్లలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఎన్ఐటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 40 రకాల వేరియంట్లు గుర్తించగా, అందులో 20 రకాల వేరియంట్లపై ఎన్ఐటీలో పరిశోధనలు జరిగాయి. వైరస్ వేగంగా మ్యూటేషన్ చెందడం వలన హైబ్రీడ్ వేరియంట్‌గా మారుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. థర్డ్ వేవ్‌లో బి 1.617.2 వేరియంట్ ఎటాక్ చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఈ వేరియంట్ వియాత్నం, యూకేలో బయటపడిందని, శరీరంపై దద్దుర్లు, కళ్లకింద మంటలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
No comments