Latest

Loading...

Corona: యాంటీబాడీలను గుర్తించేందుకు రక్తపరీక్ష..

Corona

 ఓ చిన్న రక్తపరీక్షతో కరోనా యాంటీబాడీలను గుర్తించే విధానాన్ని అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ విధానం ద్వారా యాంటీ బాడీలను కొనుగొనవచ్చని తెలిపారు. నాలుగు వందల మంది కోవిడ్ రోగుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను ఈ విధానం ద్వారా పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంతో యాంటీ బాడీలను గుర్తించినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం యాంటీ బాడీలను గుర్తించేందుకు చేస్తున్న లేటరల్ ఫ్లో టెస్ట్ కంటే ఇది వేగంగా, స్పష్టమైన ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ విధానంలో పరీక్ష చేయాల్సిన వ్యక్తి వేలి నుంచి రక్తపు చుక్కను తీసుకుని ఒక కార్డుపై వేస్తారు.

దానిపై ఫ్యూజన్ ప్రోటీన్ ఉంచి యాంటీబాడీలను గుర్తిస్తారు. టీకా తీసుకున్నారో లేదో అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.


No comments

Powered by Blogger.