Latest

Loading...

Corona : కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో వారే అధికం...!!

Corona


చిన్నారులపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అంతగా ఉండబోదని పేర్కొన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మరో విషయాన్ని వెల్లడించారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో 60-70 శాతం మందిలో కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక వ్యాధులు) లేదంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడాన్ని గుర్తించామన్నారు. మరికొందరు కీమో థెరపీకి చేయించుకున్న వారు కూడా ఉన్నారని అన్నారు. అయితే, ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఆసుపత్రులకు వెళ్లకుండానే కోలుకుంటున్నట్టు చెప్పారు.

ఇక, 1918 నాటి డాటాను గమనించినట్టయితే సెకండ్ వేవ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయని, థర్డ్ వేవ్‌లో అలాంటిదేమీ లేదని వివరించారు.

కాబట్టి థర్డ్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్ గులేరియా తేల్చిచెప్పారు.


No comments

Powered by Blogger.