Latest

Loading...

Corona ఒకసారి కరోనా వస్తే.. రెండోసారి రావటానికి ఛాన్స్ ఎంత...?

Corona 2nd time


ఒకసారి కొవిడ్ వస్తే.. మళ్లీ ఎంతకాలం పాటు వచ్చే అవకాశం ఎంత ఉంది? ఎప్పుడు ఉంది? అన్న సందేహాలకు సమాధానాల్ని తాజాగా బ్రిటన్ లో చేసిన పరిశోధన చెబుతోంది. కొవిడ్ ఒకసారి వస్తే.. వారికి రోగ నిరోధక శక్తి దాదాపు పది నెలల వరకు ఉంటుందని.. ఈ సమయంలో కొవిడ్ ఇన్ ఫెక్షన్ నుంచి ప్రమాదం లేదని చెబుతున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనను లాన్సెట్ లో ప్రచురించారు.ఇందులో భాగంగా వైద్య సిబ్బందితో కలిసి మొత్తం 2111 మందికి గత అక్టోబరులో పరిశోధన చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పలు ధఫాల్లో పరిశోధనల నిమిత్తం వారికి కొవిడ్ యాంటీబాడీ రక్త పరీక్షల్ని నిర్వహిస్తారు.

వీరిలో682 మంది సామాన్యులైతే.. 1429 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో 634 మంది గతంలోనే కొవిడ్ బారిన పడిన వారే. అధ్యయనం సమయంలో 93 మంది సామాన్యులకు..

111 మంది సిబ్బందికి తొలిసారి ఇన్ ఫెక్షన్ బారిన పడ్డారు. మిగిలిన వారితో పోలిస్తే.. ఒకసారి కొవిడ్ వచ్చి ఇంట్లో ఉంటున్న వారికి.. రీ ఇన్ ఫెక్షన్ ముప్పు 85 శాతం.. వైద్య సిబ్బందికి 60 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు. మొత్తంగా కొవిడ్ టీకా వేయించుకున్న వారికి పది నెలల పాటు మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందన్న మాట వెల్లడైంది. తాజా అధ్యయనం మరోసారి వ్యాక్సిన్ అవసరాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి.

No comments

Powered by Blogger.