Latest

Loading...

Covid vaccine : కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా...?

 


ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. భారతదేశంలో కూడా డిసెంబర్ నాటికి ప్రజలందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలన్నది టార్గెట్‌గా నిర్ణయించారు. బ్రిటన్‌లో ఇప్పటికే 4 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇవ్వడం పూర్తయింది. మరి కొన్ని రోజుల్లో దేశంలో ఉన్న వయోజనులందరికీ వ్యాక్సీన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కోసం టీకాలపై ప్రయోగాలు, పరిశోధనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.


ఈ ట్రయల్స్ పని చేసే తీరు గురించి బ్రాడ్‌ఫోర్డ్ రాయల్ ఇన్ఫర్మరీలో పని చేస్తున్న డాక్టర్ జాన్ రైట్ వివరించారు.


గత వారం బ్రాడ్‌ఫోర్డ్‌లో ఈ పరిశోధనలో పాల్గొనేందుకు ఒక కొత్త వాలంటీర్ల‌ను విధుల్లో చేర్చుకున్నారు.


నా సహోద్యోగి ప్రొఫెసర్ అలెక్స్ బ్రౌన్ తొలి డోసు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన గత సంవత్సరం అంతా కోవిడ్ వార్డుల్లో పని చేయడంతో పాటు, వైరస్ బారిన కూడా పడి తీవ్రంగా పోరాడారు.

హెపటైటిస్ లాంటి వ్యాక్సీన్లు ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం పని చేస్తాయి. పోలియో, టెటానస్ వంటి వాటికి, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బూస్టర్ డోసులు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. శీతాకాలంలో వచ్చే జలుబు లాంటి వాటికి మాత్రం ప్రతీ ఏడాది వ్యాక్సిన్లను ఇవ్వవలసి ఉంటుంది.


కోవిడ్ వైరస్ కొత్తది కావడంతో ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత, వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి ఎంత కాలం పాటు ఉంటుందో తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం.


కానీ, కోవిడ్ కొత్త వేరియంట్‌లకు జలుబుకు ఇచ్చే వ్యాక్సీన్లలా ప్రతీ ఏడాది ఇవ్వవలసిన అవసరం ఉండకపోవచ్చు. అయితే, ఏ వ్యాక్సీన్ ఎక్కువ రక్షణ ఇస్తుందనేది మనకింకా తెలియదు.


కొత్తగా తలపెట్టిన కోవ్ బూస్ట్ ప్రయోగం మనకు కొన్ని సమాధానాలను ఇస్తుంది.

కోవిడ్ వైరస్ వచ్చిన ఒక ఏడాది లోపే మనం కొన్ని రకాల వ్యాక్సీన్లను చూశాం. ఈ కొత్త ట్రయల్స్‌లో ఆస్ట్రాజెనెకా, ఫైజర్, నోవావ్యాక్స్, జాన్సెన్ వ్యాక్సీన్లతో పాటు 7 రకాల వ్యాక్సీన్లను పరీక్షిస్తున్నారు. ఇందులో కొన్నిటిని సగం డోసు మాత్రమే వేసి పరీక్షిస్తారు.


"లాక్ డౌన్ సడలించడంతో కోవిడ్ అంతమైపోయిందని చాలా మంది భావించారు. కానీ, దీనిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇది మహమ్మారి అనేకంటే, నిరంతరం ఉండే రోగంలా అయిపోతుంది" అని అలెక్స్ బ్రౌన్ అన్నారు.


ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులకు ఈ వ్యాక్సీన్ ఇస్తున్నట్లు చెప్పారు.


"వేర్వేరు వ్యాక్సీన్లు ఒకదానితో ఒకటి కలిపితే ఎలా పని చేస్తాయో, ఈ ట్రయల్స్ వల్ల తెలియాలి" అని బ్రాడ్‌ఫోర్డ్‌లో ట్రయల్స్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ దినేష్ సరాలయ అన్నారు.


"ఈ ట్రయల్స్‌లో పాల్గొనే వారు అప్పటికే తీసుకున్న వ్యాక్సీన్ కాకుండా మరో వ్యాక్సీన్‌ను ఇస్తారు. ఇలా వివిధ రకాల వ్యాక్సీన్లను మిశ్రమం చేసి చూడటం వల్ల ఏ యే రకాల వ్యాక్సీన్లను కలిపితే నిరంతరం రక్షణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు" అని దినేష్ చెప్పారు.

ఈ ట్రయల్స్ క్లినిక్‌లో వాలంటీర్లను నియమించుకోవడానికి నేను శుక్రవారం బ్రాడ్‌ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్‌లో చేరాను,


నేను వ్యాక్సీన్ ట్రయల్స్‌లో ఉండగా వాలంటీర్లకు తమ పై కాకుండా ఇతరుల పై ఉన్న శ్రద్ధ నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ, వారి ధైర్యం, శ్రద్ధ చూస్తే వారి పట్ల వినయ భావాన్ని కలుగచేశాయి.


అందులో జోయ్స్ బింక్స్ అనే ఒక 82 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. ఆమె భర్త మూడు వారాల క్రితమే మరణించారు. ఆమెకు కూడా ముప్పు ఉన్నప్పటికీ ఎటువంటి సంకోచం లేకుండా ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి వచ్చారు.


"నాకు గొంతు క్యాన్సర్ వచ్చి తగ్గింది. అన్ని రకాల వ్యాధుల చికిత్స కోసం ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి" అని ఆమె నాతో చెప్పారు.


"నేను జీవితాన్ని అనుభవించాను. నేనిప్పుడు బాధపడుతున్న చిన్న వయసు వారి కోసం ఆలోచిస్తున్నాను. ఎవరో ఒకరు స్వచ్చందంగా ముందుకు వచ్చి డాక్టర్లకు, నర్సులకు సహాయం చేయాలి" అని అన్నారు.

మహమ్మారి సమయంలో కోవిడ్ బారిన పడి మరణిస్తున్న రోగులను చూసి, గుండె కోతను అనుభవించిన పాలియేటివ్ డాక్టర్ జమీలా హుస్సేన్ కూడా ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు.


ఆమె పని చేసిన ఆసుపత్రిలో, కోవిడ్ బారిన పడిన వారు త్వరత్వరగా మృత్యువాత పడుతూ ఉండేవారని, అందులో చాలా మంది ఒంటరిగా ఉండేవారని చెప్పారు. వారి కుటుంబాలతో ఆఖరి క్షణాలు గడపాలనే కోరిక వారికి తీరేది కాదని చెప్పారు. ఇవన్నీ చూసిన ప్రభావం, సంరక్షకుల పై చాలా రోజుల పాటు ఉంటుందని ఆమె చెప్పారు.


దీంతో పాటు, ఆమె బ్రాడ్ ఫోర్డ్ లో ఉంటున్న దక్షిణ ఆసియా వాసుల్లో వ్యాక్సీన్ పట్ల ఉన్న సంకోచాన్ని కూడా చూశారు. వ్యాక్సీన్లు సురక్షితమే అని తెలియచేసేందుకు ఆమె ఒక రోల్ మోడల్ కూడా కావాలని అనుకుంటున్నారు.

చాలా మంది మమ్మల్ని వ్యాక్సీన్లు సురక్షితమేనా అని అడుగుతారు. అందుకే, నేను కేవలం వ్యాక్సీన్లు తీసుకోవడం మాత్రమే కాదు, వ్యాక్సీన్ ట్రయల్స్‌లో కూడా పాల్గొంటున్నాను. నేను శాస్త్రవేత్తలను నమ్ముతున్నాను, అని చెబుతాను. నేను ట్రయల్స్ లో పాల్గొనడానికి ముందుకు రావడానికి ఇదే ప్రధాన కారణం" అని అన్నారు.


అయితే, ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న అలెక్స్, జోయ్స్, జమీలాకు ప్రతికూల ప్రభావాలేవీ కనిపించకపోవడం సంతోషం. జమీలా మాత్రం 48 గంటల పాటు కాస్త ఇబ్బంది పడటంతో పారాసెటమాల్ తీసుకోవలసి వచ్చింది. జోయ్స్ కు కూడా కాస్త నలతగా అనిపించింది కానీ, అలెక్స్‌కు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదు.


ఈ ట్రయల్స్ కొనసాగుతుండగా వీరందరినీ పర్యవేక్షిస్తాం. ఈ ట్రయల్స్ తర్వాత వచ్చే వసంతం నాటికి బూస్టర్ డోసులు దొరుకుతాయో లేదో అర్ధమవుతుంది. అలాగే, ఏ వ్యాక్సీన్ డోసులు ఉత్తమ ఫలితాలనిస్తాయో కూడా అర్ధమవుతుంది.

No comments

Powered by Blogger.