Latest

Loading...

Credit Card Bill : క్రెడిట్ కార్డు బిల్లు అధిక మొత్తంలో వచ్చిందా...? ఇలా సులువుగా చెల్లించండి.

Credit card bill

 Credit Card Bill : మీకు క్రెడిట్ కార్డు బిల్లు భారీ మొత్తంలో వచ్చిందా? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు కట్టడానికి మార్గం ఉంది. అదే ఈఎంఐ. అవును.. అధిక మొత్తంలో ఉన్న బిల్లును చెల్లించలేని వారికి, ఈఎమ్ఐ ఆప్షన్ ఇస్తున్నాయి క్రెడిట్ కార్డు సంస్థలు. అవుట్ స్టాండింగ్ అమౌంట్‌ (చెల్లించని మొత్తం బిల్లు)ను లేదా అందులో కొంత మొత్తాన్ని నెలవారీ సమాన వాయిదాలుగా మార్చుకుని… తక్కువ వడ్డీతో, సౌకర్యవంతమైన కాల పరిమితితో తిరిగి చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసి… ఆ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించలేని వారూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.


వాస్తవానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు నిర్ణీత తేదీ ఉంటుంది. ఆ లోపు చెల్లిస్తే వడ్డీ వర్తించదు. లేకపోతే చెల్లించాల్సిన మొత్తంపై వార్షికంగా 30 శాతం నుంచి 40 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా తాజా లావాదేవీలపై వడ్డీ లేని సమయాన్ని రద్దు చేసే అవకాశమూ ఉంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్.


కట్టాల్సిన మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు లేదా అందులో కొంత భాగం ఈఎమ్ఐగా మార్చుకోవచ్చు. భారీ ఫైనాన్స్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు బిల్లుపై చెల్లించవలసిన ఆలస్య రుసుముల నుంచి ఇది కాపాడుతుంది. పెద్ద మొత్తంలో ఉన్న బిల్లును ఒకేసారి చెల్లించే కంటే చిన్న చిన్న భాగాలుగా చేసి ఈఎమ్ఐ రూపంలో సులభంగా చెల్లించొచ్చు.


కార్డు జారీదారు ముందుగా తెలిపిన పరిమితికి మించి లావాదేవీలు చేసినప్పుడు.. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐలుగా మార్చేందుకు వినియోగదారులకు ఈ ఆప్షన్ అనుమతిస్తుంది. నిర్ధిష్ట కార్డు లావాదేవీలను, ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను ఈఎమ్‌లుగా మార్చుకునేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.


క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బదిలీని ఈఎమ్ఐగా మార్చుకునే సదుపాయాన్ని చాలా వరకు క్రెడిట్ కార్డు జారీదారులు అందిస్తున్నారు. ఒక క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌ను, మరొక సంస్థ జారీ చేసిన కార్డుకు బదిలీ చేసి, ఆ మొత్తాన్ని ఈఎమ్ఐ మార్చుకోవడానికి ఈ ఆప్షన్ అనుమతిస్తుంది.

No comments

Powered by Blogger.