Dates benefits బరువును తగ్గించే ఖార్జురా... ఇంకా ఆరోగ్య ప్రయోజనాలెన్నో...
ఆరోగ్యకరమైన డైట్‌ను తీసుకోవాలనుకునే వారు ఆహారంలో చేర్చుకోదగ్గ వాటిల్లో ఖర్జూర ఒకటి. సహజసిద్ధ తీపిని అందించడంతో పాటు శరీరానికి మేలు చేసే ఫైబర్లు, ఐరన్ మొదలైనవి ఇందులో అధికం..

బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తీసుకుంటే పొట్ట నిండుగా అనిపించి త్వరగా ఆకలవ్వదు. బరువు పెరగాలనుకునే వారు ఎండువి తీసుకోవచ్చు. సహజ చక్కెరలు, కెలొరీలు వీరికి సాయపడతాయి. * వీటిలో యాంటీఆక్సిడెంట్ల మోతాదు ఎక్కువ.
అల్జీమర్స్, కొన్ని రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. దీనిలోని కెరొటినాయిడ్స్ కంటికీ, గుండెకీ మంచిది. * గుండె ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధిక మొత్తంలో ఉంటాయి. రక్తపోటును తగ్గించడానికీ తోడ్పడుతుంది.
No comments