Diabetes with fruits పండ్లతో టైప్ 2 డయాబెటిస్ కు చెక్....!!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పీడిస్తున్న మధుమేహం మనిషి శరీరంలో కీలక అవయవాలను నిర్వీర్యం చేస్తూ పలు దుష్ప్రభావాలకు దారితీస్తోంది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం 2019లో డయాబెటిస్ కారణంగా 15 లక్షల మంది మరణించారు. నియంత్రణ లేని డయాబెటిస్ పలు తీవ్ర అనారోగ్యాలకూ దారితీసి మానవాళికి సవాల్ విసురుతోంది. ఇక పండ్ల రసాలను పక్కనపెట్టి పండ్లను తరచూ తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అథ్యయనం వెల్లడించింది.
అధిక బరువు, వ్యాయామం కొరవడటం వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్ ను నిలువరించాలంటే శారీరకంగా చురుకుగా ఉండాలి. సమతులాహారంతో పాటు పండ్లు పుష్కలంగా తినడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది.
రోజుకు 150 గ్రాములు లేదా రెండు కప్పుల పండ్ల ముక్కలు తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ముప్పు 32 శాతం తక్కువగా ఉన్నట్టు అథ్యయనంలో వెల్లడైంది.
అథ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమయ్యాయి. పండ్లు అధికంగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ సంబంధిత గ్లూకోజ్ టాలరెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉంటాయని అథ్యయనం తేల్చింది. నిత్యం యాపిల్, అరటిపండ్లు, బత్తాయి, నారింజ, ఇతర సిట్రస్ జాతి పండ్లను తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు తక్కువగా ఉన్నట్టు అథ్యయనంలో గుర్తించారు.
No comments