Diabetes: కరోనా వచ్చినా షుగర్ అదుపులో ఉండాలంటే..!
కరోనా వచ్చినా షుగర్ అదుపులో ఉండాలంటే....
కరోనా వచ్చినా ఆహారం ద్వారా బ్లడ్షుగర్స్ను ఎలా నియంత్రించుకోవచ్చు?
రక్తంలో చక్కెరస్థాయులు నియంత్రణలో ఉంచుకుంటూ, మంచి ఆహార అలవాట్లు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా అన్ని పాటిస్తూ ఉంటే కొవిడ్ వచ్చినా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండకపోవచ్చు. కొవిడ్ వచ్చిన కొందరిలో ఇన్ఫ్లమేషన్ (వాపు) వల్ల సహజసిద్ధంగానే చక్కర స్థాయులు పెరగొచ్చు. కాబట్టి కొవిడ్ వచ్చిన తర్వాత వాడుతున్న మందులు, గ్లూకోమీటరుతో చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో పెట్టుకోవాలి.
ఆహారంలో మార్పులు! కొవిడ్ వచ్చినా మధుమేహులు అప్పటిదాకా పాటించిన ఆహార నియమాలనే అనుసరించాలి. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయులు పెరగొచ్చు. కాబట్టి ఒక్కసారిగా అలవాట్లలో మార్పులు చేసుకోవద్దు. అలాగే మోతాదూ పెంచొద్దు. మాంసకృత్తులు, పీచు, ప్రొబయోటిక్ పదార్థాలు, ఒమేగా-3 కొవ్వులను మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. కీలక పోషకాలను కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. వీలైనంత మటుకు వ్యాయామం చేయాలి.
ప్రొటీన్స్: ఉడికించిన గుడ్డు, పప్పుదినుసులు: సోయా నగ్గెట్స్. పీచు: పొట్టు తీయని ధాన్యాలు. ఇడ్లీ రవ్వ బదులు జొన్నరవ్వ, మధ్యాహ్నం అన్నానికి బదులుగా ముడి బియ్యం, గోధుమ రవ్వ కూడా ఎంచుకోవచ్చు. ఓట్స్ జావ, రాత్రిపూట ఓట్స్ రాగి ముద్ద, కొర్రల కిచిడి తీసుకోవచ్చు. వీటితో పాటు రోజూ కనీసం 100 గ్రా. ఆకు కూరలు, 200 గ్రా., కూరగాయలు, 100 గ్రా. కీర, క్యారెట్ లాంటి వాటిని సలాడ్లుగా తినాలి.
ప్రీ, ప్రొ బయోటిక్ పదార్థాలు: శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు ఇవి దోహదపడతాయి. కాబట్టి ఆహారంలో తక్కువ వెన్నశాతం పాలు, పెరుగు, పుల్ల మజ్జిగ వాడుకోవాలి. ఉల్లిపాయలు, అరటికాయ, ఓట్స్‌ను తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: వాపులు తగ్గించడానికి ఇవి అవసరం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, పప్పులు, అవిసె, చియా గింజలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు.
No comments