Latest

Loading...

Digestive system : మీ జీర్ణవ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే.….రోజు ప‌ర‌గ‌డుపున ఇవి తాగండి…?

Digestive system


Digestive  ప్ర‌తి ఒక్క‌రు రోజూ ఉద‌యం ఎదోఒక‌టి తింటూ ఉంటారు . అది బ్రెక్ ఫాస్ట్ అవ‌చ్చు,వేడి వేడి టీ , కాఫీ లు కావచ్చు , మీ రోజు వారి దిన చ‌ర్య‌లో ఈ విధంగా ఉంటే ఇది వేంట‌నే మార్చుకోండి . ఎందుకంటే మ‌నం నిద్ర నుంచి లేచిన‌ప్పుడు మ‌న‌ జీర్ణ క్రీయ విధానం చాలా నెమ్మ‌ది గా జ‌రుగుతుంది. క‌డుపు యొక్క పీహెచ్ స్థాయి ఎక్కువ‌గా ఉంటుంది . మ‌నం నిర్జ‌లీక‌ర‌ణానికి గురి అవుతాము . అటువంటి స‌మ‌యంలో క‌డుపులోనికి అధిక ఆహ‌రం లేదా కేఫిన్ పంపిన‌ప్పుడు . ఇది జీర్ణవ్య‌వ‌స్థ యొక్క ఆరోగ్య స్థితిని ఎక్కువ‌గా కోల్పోతుంది.


మ‌నం సాధార‌ణంగా మ‌ధ్యాహ్నం టైమ్ లో తిన్న‌ప్పుడు . మ‌న ప్రేగులు చాలా దూదిలా మృదువుగా మారుతాయి . ఈ టైమ్ లో ఎక్కువ పోస్టికాహ‌రంను తిసుకోగ‌లుగుతారు . కావునా మీరు ఉద‌యం నిద్ర‌నుంచి లేవ‌గానే మీ యొక్క దిన‌చ‌ర్య‌లో భాగంగా బ్రెక్ ఫాస్ట్ , వేడి వేడి టీ , కాఫీ లు కాకుండా . ఈ స‌మ‌యంలో ఎక్కువ పోష‌కాలు ఉన్న కొన్ని ర‌కాల పానియాలు (జ్యూస్) తాగ‌డం వ‌ల‌న మీ జీర్ణాశ‌యం చాలా ఆరోగ్యంగా ఉంచడ‌మే కాకా ఆ రోజంతా చురుకుగా ప‌నిచేస్తుంది . ప‌రిగ‌డ‌పున ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల‌న మీకు జీర్ణాశ‌యం ను మేరుగుప‌ర్చ‌డానికి ఒక ర‌క‌మైన పానియంల‌ను ప‌రిచ‌యం చేస్తోంది . అవి ఎటువంటి పానియంలో తెలుసుకుందాం .


తుల‌సి ర‌సం : Digestive

తుల‌సి ఒక మంచి దీవ్యౌష‌దం అని చెప‌వ‌చ్చు . అలాగే తుల‌సి ఆకుల‌ను ప‌రిగ‌డ‌పున తిన‌డం వ‌ల‌న కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి .ఆ తుల‌సి ఆకులను నీటిలో భాగా ఉడ‌క‌బెట్టాలి .ఉడ‌క‌బెట్టి తిసిన ర‌సాన్ని ప‌రిగ‌డ‌పున తిసుకొవ‌డం వ‌ల‌న జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రీయ ఎంజైమ్ ల‌ను ఉత్ప‌త్తిని పెంచుతుంది మ‌రియు జీర్ణ‌క్రీయ బాగా జ‌రిగేలా చేస్తుంది. తుల‌సి ఆకుల వ‌ల‌న వ‌ర్షాకాలంలో వ‌చ్చే మ‌లేరియా , డేంగ్యు జ్వ‌రం వ్యాప్తి త్రివ్రంగా ఉన్న‌పుడు లేత తుల‌సి ఆకుల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించి తాగితే ఈ ర‌క‌మైన జ్వరాల‌నుంచి మంచి ఉప‌స‌మ‌నం పోంద‌వ‌చ్చు. తుల‌సి ఆకుల‌ను ప‌రిగ‌డ‌పున తిన‌డం వ‌ల‌న జ‌లుబు , ప్లూ వంటి వ్యాధుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప‌లు ర‌కాలా ఆయుర్వేద ద‌గ్గు మందుల‌లో ఈ తుల‌సి ఆకుల‌ను క‌లుపుతారు .

ఈ ఆకులు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.` రేడియేష‌న్ ` కు ఎక్కువ‌గా గురైనందువ‌ల‌న క‌లిగే విష‌మ ప‌రిస్థితి నుండి కాపాడుతుంది. చ‌క్కెర స్థాయిల‌ను కూడా నియంత్రిస్తుంది . చ‌ర్మ‌స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. చిన్న పిల్ల‌ల్లో స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపించే ద‌గ్గు , జ్వ‌రం , డ‌యేరియా , వాంతులు వంటి స‌మ‌స్య‌ల‌కు ఈ తుల‌సి ర‌సాన్ని తాగిస్తే మంచి ఉప‌స‌మ‌నం క‌లుగుతుంది . ఈ కాలంలో వ‌చ్చే ప‌లు ర‌కాలా ఇన్ ఫెక్ష‌న్లు దూరంగా ఉంచుతాయి. యాంటిసెప్టిక్ గుణంను క‌లిగి ఉంటుంది. దినిలో పోష‌కాలు , విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి . అంతే వ్యాధినిరోధ‌క శ‌క్తిని క‌లిగి ఉంటుంది. ఈ తుల‌సి ర‌సంలో కొద్దిగా తేనెను క‌లిపి తిసుకోవ‌డం వ‌ల‌న దిని రూచి మ‌రింత పెరుగ‌తుంది 


గోదుమ గడ్డి ర‌సం : Digestive

ఈ గోదుమ గడ్డి ర‌సం ను ఉదాయాన్నే తాగ‌డం వ‌ల‌న మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ర‌క్త ప్ర‌వాహ‌న్ని స‌రిగ్గా జ‌రిగేలా చేస్తుంది. శ‌రిర బ‌రువును త‌గ్గిస్తుంది . చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అధిక ఆహ‌రంను తిసుకోవ‌డాన్ని తగ్గిస్తుంది. అల‌స‌ట‌ను త‌గ్గిస్తుంది . జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో విష‌తుల్యాల‌ను బ‌య‌ట‌కు పంపివేస్తుంది. జీర్ణ క్రీయను స‌క్ర‌మంగా జ‌రిగేలా చెస్తుంది.


అల్లం ,ప‌సుపు మ‌రియు మిరియాలు, థైమ్ , తాగాలి : మిరియాలు మ‌రియు థైమ్ జ‌లుబుకు మంచి పానియం . అధిక శ్లేష్మం సైన‌స్ కూహ‌రాన్ని అడ్డుకుంటుంది . బ్యాక్టిరియా మ‌రియు వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ల‌కు ల‌నుండి కాపాడుతుంది. మీ వాయుమార్గం శుభ్రం గా మ‌రియు ఆరోగ్యంగా మీరు కోరుకుంటే ప‌రిగ‌డ‌పున తాగండి . ఒక గిన్నెలో నిటిని తిసుకొని ఆ నిటిలో ఒక టేబుల్ స్పూన్ థైమ్ ను వేసి . 1 లేదా 2 మిరియాల‌ను వేసి , కొద్దిగా తుర్మిన అల్లం ను మ‌రియు ప‌సుపు ను వేసి 10 నిముషాలు ఉడ‌క‌బేట్టాలి .


నిమ్మ ర‌సం : Digestive


2 టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సంను కొద్దిగా గోరువేచ్చ‌ని నిటిలో వేసి బాగా క‌లిపి ప‌ర‌గ‌డుపున తిసుకొవ‌డం వ‌ల‌న ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి . నిమ్మ ర‌సంను తిసుకొవ‌డం వ‌ల‌న ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు . వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇన్ ఫెక్ష‌న్లు దూరంగా ఉంచుతాయి. దినిలో విట‌మిన్ – సి అధికంగా ఉంటుంది. దినిలో సీట్రికామ్లం ఉండ‌టం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌ని తిరును బాగా ప‌నిచేసేలా చేయ‌డ‌మే కాకా జీర్ణ క్రీయ వృధ్దిని పెంపోందిస్తుంది. శ‌రిరంలో విష‌తుల్యాల‌ను బ‌య‌ట‌కు పంపివేస్తుంది .


నిమ్మ,అల్లం మ‌రియు తేనె క‌లిపి తిసుకోవ‌డం వ‌ల‌న :


ఈ పానియంను ప‌రిగ‌డ‌పున తాగ‌డం అల‌వాటు చేసుకోవ‌డం చాలా మంచిది . అల్లంను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తిసుకోని బాగా వేడి చేసి కొద్దిగా మ‌రిగిన త‌రువాతా చ‌ల్లార‌న్వాలి . గోరువేచ్చ గా ఉన్న‌ప్పుడు అందులో కొద్దిగా తేనె , నిమ్మర‌సంను వేసితాగాలి మంచి ఫ‌లితం ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉండ‌ట‌మే కాకా , జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌స‌ర్చుతుంది . మ‌రియు అజీర్ణం మ‌రియు వికారం మ‌రియు గండెలో మంటను నివారిస్తుంది . ఇది ఎక్కువ‌గా శీతాకాలంలో సెవిస్తే మంచిది . దినివ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెరుగుతుంది.


నిమ్మ,అల్లం మ‌రియు దాల్చిన‌చెక్క , ప‌సుపు ,మీరియాలు , తేనె క‌లిపి తాగ‌డం వ‌ల‌న :


అల్లం మ‌రియు దాల్చిన‌చెక్క , ప‌సుపు ,మీరియాలు , క‌లిపి నిటిలో వేసి బాగా మ‌రిగించి చ‌ల్లార‌నిచ్చి కొద్దిగా నిమ్మ ర‌సంను మ‌రి కొద్దిగా తేనెను జోడించి రోజూ తాగ‌డం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ లోని ప్రేగును మెరుగుప‌రుస్తుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇది శీతాకాలంలో ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల‌న జ‌లుబు మ‌రియు ప్లూ వంటి వ్యాధులు రాకూండా చేస్తుంది .


ఆఫిల్ సైడ‌ర్ , వేనిగ‌ర్ , వేల్లుల్లి ,నిమ్మ,అల్లం మ‌రియు బెర‌డు , ప‌సుపు ,మీరియాలు , తేనె క‌లిపి తాగ‌డం వ‌ల‌న :


మీరు ఆఫిల్ సైడ‌ర్ ను ప‌రిగ‌డ‌పున తాగ‌డంవ‌ల‌న .మీరు వేంట‌నే అపాన‌వాయువు మ‌రియు క‌డుపు ఉబ్బ‌రం నుండి బ‌య‌ట ప‌డ‌టానికి లేదా ప్రేగులోని బ్యాక్టిరియాల‌ను చంప్ప‌డానికి స‌హ‌యప‌డుతుంది. ఆఫిల్ సైడ‌ర్ , వేనిగ‌ర్ , వేల్లుల్లి ,నిమ్మ,అల్లం మ‌రియు బెర‌డు , ప‌సుపు ,మీరియాలు , తేనె క‌లిపి తాగ‌డం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.


ఫ‌లిలాలు :

మ‌న ఆరోగ్యం మ‌నం ప‌రిగ‌డ‌పున‌ రోజూ తిసుకొనే ఆహ‌రంపై ఆధార‌ప‌డి ఉంటుంది . ఉద‌యం లేవ‌గానే కాఫీ , టీ , తాగడం వ‌ల‌న ఆ రోజంతా క‌డుపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాద‌ప‌డ‌తారు . మీరు రోజూ చాలా స‌ర‌ళ‌మైన పానియాల‌తో ప్రారంభించాల‌నుకుంటే , వేడి నీటి టంబ్ల‌ర్ తాగితే స‌రిపోతుంది. గోరు వేచ్చ‌ని పానియంను  వ‌ల‌న ప్రేగుకు మేలుచేస్తుంది .


No comments

Powered by Blogger.