Latest

Loading...

Drinking Pot Water: కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి....!

Drinking Pot Water

 

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు.. సూర్యుడి తాపానికి ఒంట్లో వేడిని చల్లబరుచుకునేందుకు అందరూ కూడా మట్టికుండల్లోని నీళ్లను తాగేవారు. మట్టి కుండల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలితో పాటు మట్టి కుండలను కూడా వాడటం జనాలు మర్చిపోయారు.


ఈ మట్టి కుండలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ వాడుతున్నా.. సిటీల్లో జనాలు మాత్రం నీటిని చల్లబరిచేందుకు ఫ్రిడ్జ్‌లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. మట్టికుండల్లో నీటిని తాగితే ఎన్నో సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.

మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

అతిగా దాహం వేయదు

ఎసిడిటీ సమస్యలు అదుపులో ఉంటాయి

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

శరీరాన్ని చల్లబరుస్తుంది

వడదెబ్బ సమస్యల నుంచి రక్షిస్తుంది

మెటబాలిజం రేటు పెరుగుతుంది

జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

గొంతుకు సంబంధించిన సమస్యలు రావు

జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది

శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది

టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది

జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది


No comments

Powered by Blogger.