Latest

Loading...

Elaichi & Hot water: నిద్రపోయే ముందు యాలకును తిని వేడి నీరు తాగితే కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే షాకవుతారు....!

 

Elaichi & Hot waterBenefits fo Elaichi and Hotwater: మన వంటిల్లే ఒక ప్రకృతి ప్రసాదిత మెడికల్ షాపు.. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు అల్లోపతి మందులను ఆశ్రయించి ఆపై సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడేకంటే  చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వంట ఇంట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో తీర్చుకోవచ్చు.. సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు. సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన యాలుకులతో..

కలిగే ప్రయోజనలు వింటే.. అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.. ఎవరికైనా..


రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే కలిగే ప్రయోజనలు తెలుసుకుందాం..


*ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. ఈ మద్య కాలం లో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

*నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది.

*మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.

*మరీ ముఖ్యంగా..చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు.

*నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యాలక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది.

*రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది.

*అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది.

*జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.




No comments

Powered by Blogger.