Latest

Loading...

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ ఎప్పుడంటే....?

EPFO

 ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాల్లో జులైలో జమ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఏ తేదీన జమ చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.


గత మార్చిలో ఈపీఎఫ్‌ఓ కేంద్ర సభ్యుల బృందం సమావేశమై వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 8.5 శాతం కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 7 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం ఉండగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55శాతంగా ఉంది. ఏటా మార్చిలో ఈపీఎఫ్‌ఓ కేంద్ర సభ్యుల బృందం సమావేశమై ఎంత వడ్డీ రేటు చెల్లించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది.

No comments

Powered by Blogger.