Latest

Loading...

Family Pension : ప్రభుత్వ ఉద్యోగి మరణించిన నెలకే పెన్షన్‌, కేంద్రం కీలక ఆదేశం...!

Family Pension

Family Pension : పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాలకు ఊరటనిచ్చేలా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన నెల రోజుల్లోనే కుటుంబ సభ్యులకు పెన్షన్‌ అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్లను ఆదేశించింది. పాత పెన్షన్‌ పథకం కింద ఉన్న, జాతీయ పెన్షన్‌ వ్యవస్థలో ఉన్న మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన మొత్తాలను కూడా ఆ కుటుంబానికి వెంటనే చెల్లించాలంది.
దీంతోపాటు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్నీ, ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ కార్పస్ నూ కుటుంబ సభ్యులకు చెల్లించాలని తెలిపింది. కుటుంబ పెన్షన్‌ను ప్రారంభిస్తున్నప్పుడే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలంది.

No comments

Powered by Blogger.