Govt Jobs after 10th: టెన్త్ పాస్ అయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే...!
కరోనా వైరస్ మహమ్మారి కారణంతో తెలంగాణలో టెన్త్ పరీక్షలు జరగలేదు. విద్యార్థులందర్నీ పాస్ చేసింది ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఎగ్జామ్స్ జూలైలో జరిగే అవకాశం ఉంది. టెన్త్ క్లాస్ ప్రతీ విద్యార్థి కెరీర్లో ఓ మైలురాయి లాంటిది. కెరీర్‌ను మలచుకోవడానికి టెన్త్ క్లాస్ తర్వాత తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయి. అందుకే టెన్త్ తర్వాత ఏం చదవాలన్నదానిపై ముందునుంచే ప్రిపేర్ అవుతుంటారు. ఇక కొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా టెన్త్‌తో చదువు ఆపేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి డిగ్రీలు, పీజీలు చేయాలన్న అపోహ ఉంటుంది. డిగ్రీ, పీజీలు మాత్రమే కాదు... టెన్త్ అర్హతతో కూడా అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఖాళీలను టెన్త్ అర్హతతోనే భర్తీ చేస్తుంటాయి. భారతీయ రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కూడా టెన్త్ అర్హతతో ఉన్నాయి. మరి టెన్త్ తర్వాత ఏఏ ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చో తెలుసుకోండి.
Jobs in Indian Railways: భారతీయ రైల్వేలో టెన్త్ అర్హతతో పలు ఖాళీలు నిత్యం భర్తీ అవుతుంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB గ్రూప్ డీ పోస్టుల్ని టెన్త్ అర్హతతోనే భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు కూడా టెన్త్ పాస్ అయితే చాలు. ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులకు కూడా అర్హత పదవ తరగతే. రైల్వేకు చెందిన వర్క్ షాప్స్‌లో కొన్ని అప్రెంటీస్ పోస్టులను కూడా టెన్త్ పాస్ అయినవారికి కేటాయిస్తారు.
Jobs in Staff Selection Commission: కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తూ ఉంటుంది. టెన్త్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రతీ ఏటా నోటిఫికేషన్ జారీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ప్యూన్, వాచ్‌మ్యాన్, క్యాంటీన్ అటెండెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి.
Jobs in India Post: పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగం నిరుద్యోగుల కల. టెన్త్ పాస్ అయినవారు కూడా పోస్ట్ ఆఫీసులో జాబ్స్ పొందొచ్చు. ఇండియా పోస్ట్ ప్రతీ ఏటా రెండుసార్లు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్‌మ్యాన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు టెన్త్ పాస్ అయితే చాలు. పరీక్ష కూడా ఉండదు. మెరిట్ ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు.
Jobs in Indian Defence: కూడా పదవ తరగతి పాస్ అయితే కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగాలు పొందొచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అప్రెంటీస్ పోస్టులతో పాటు బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్ లాంటి రక్షణ దళాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో మల్టీ స్కిల్ వర్కర్ పోస్టులు కూడా ఉన్నాయి.
ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక ప్రభుత్వ ఉద్యోగాలను టెన్త్ అర్హతతో భర్తీ చేస్తూ ఉంటాయి. కాబట్టి టెన్త్ పాస్ అయిన తర్వాత చదువు కాకుండా ఉద్యోగాలు కోరుకునేవాళ్లు ఈ గవర్నమెంట్ జాబ్స్‌పై దృష్టి పెట్టొచ్చు.
No comments