Latest

Loading...

HDFC Bank Jobs 2021: హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు...!!

HDFC Bank Jobs

 HDFC Bank Jobs 2021: హెచ్ డిఎఫ్ సి బ్యాంకు రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ (సేల్స్) విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. టెలిఫోనిక్ రౌండ్ & పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


ఖాళీలు, అర్హతలు


మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.

అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఫ్రెషర్స్, అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు బైక్ తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయో పరిమితి 22 నుంచి 30 ఏళ్లు ఉండాలి.


రిజిస్ట్రేషన్ కు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెలిఫోనిక్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడురాళ్లలో పని చేయాల్సి ఉంటుంది.

No comments

Powered by Blogger.