Latest

Loading...

Health Tips :చిలగడదుంపలో పోషకాలు పుష్కలం ..!

Health Tips

 ప్రస్తుతం పండిస్తున్న పంటలు అన్నింటిపై రసాయనిక మందులను వాడుతున్నారు. కానీ భూమిలో కాసే దుంపల పై మాత్రం ఇలాంటి మందులను వాడే అవకాశం ఉండదు. కాబట్టి అవి ఎలాంటి హాని చేయవు. అంతేకాకుండా వీటిలో ఎన్నో పోషకాలు నిలువ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల ఆరోగ్యంగా ఉంటాం. నిజానికి పట్టణాల్లో ఉండే వారి కంటే అడవుల్లో నివసించే వివిధ జాతుల ప్రజలు దృఢంగా ఉంటారు..ఆరోగ్యంగా ఉంటారు. దానికి కారణం వారు ఎక్కువగా దుంపలనే ఆహారంగా తీసుకుంటారు. కాగా మనకు మార్కెట్ లో దొరికే దుంపలలో చిలగడదుంప కూడా ఒకటి.


చిలగడదుంపను తెలంగాణలో అయితే కంద గడ్డ అని పిలుస్తారు. దీనిని తినడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందుతాయో ఇప్పుడు చూద్దాం..


తినడానికి తియ్యగా ఉండటంతోపాటు చిలగడదుంప తక్కువ ధరలో లభిస్తుంది. చిలకడ దుంపలో బీటాకెరోటిన్ తో పాటు విటమిన్ సి, విటమిన్ ఈ, బీ6 లు ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం ఐరన్ లు కూడా పుష్కలంగా ఉంటాయి.


ఇవి శరీర భాగాలు వాపుకు గురవకుండా కాపాడతాయి. ఇందులో ఉండే రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఐరన్ రక్తం పెరగటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తెల్ల రక్త కణాల పెరుగుదలకు మరియు ఇమ్యునిటీని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. చిలగడదుంప తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇవే కాకుండా సన్నగా ఉన్నవారు ప్రతిరోజు చిలగడ దుంపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు.

No comments

Powered by Blogger.