Latest

Loading...

Heart diseases in youth: కరోనాను జయించిన యువతలో గుండె వ్యాధులు.. కారణాలు ఇవేనా..?

Heart diseases in youth

 కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపే కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా పోస్ట్​ కోవిడ్​ తర్వాత యువతలో గుండె సమస్యలు అధికమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్​ నేరుగా గుండెకు వెళ్లే రక్త నాళాలపై ప్రభావం చూపి, దాని పనితీరు తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్​ ఫెయిల్యూర్​కు దారితీస్తోందని పేర్కొన్నారు. అంతేకాక ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టి, బీపీ పెరిగి గుండె వైఫల్యానికి దారితీస్తుందని తెలిపారు. అయితే ఈ గుండె సంబంధ వ్యాధులపై భారతీయులకు అవగాహన లేక ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో స్ట్రోక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.


ఇటీవలి కాలంలో యువకులు, కౌమారదశలో ఉన్న పిల్లలకు సైతం హార్ట్​ స్ట్రోక్స్​ వస్తున్నాయి.

చిన్న వయస్సులో వచ్చే స్ట్రోక్ వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధులలో స్ట్రోక్‌తో పోల్చితే, యువతలో వచ్చే స్ట్రోక్ వారి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అయితే, పోస్ట్-కోవిడ్ రోగుల్లో హార్ట్​ స్ట్రోక్ సమస్య సాధారణంగా కనబడుతుంది. అందువల్ల, కరోనా నుంచి బయటపడ్డామనే భావనతో నిర్లక్ష్యం చేయకుండా మాస్క్​ ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచడం వంటివి అనుసరించాలి. కరోనా నుంచి రక్షణ పొందడానికి వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలి. ఒకవేళ, మీకు స్ట్రోక్ వస్తే, చికిత్స ఆలస్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


* సమస్యకు కారణాలు ఏంటి?

హార్ట్​ స్ట్రోక్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. రక్తపోటు, డైస్లిపిడెమియా, ధూమపానం, డయాబెటిస్ మెల్లిటస్, హృదయ సంబంధ వ్యాధులు హార్ట్​ స్టోక్​కు దారితీస్తాయి. మాదకద్రవ్యాల వినియోగం, అధికంగా మద్యపానం, ధూమపానం, అధిక బరువు వంటివి హార్ట్ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అందువల్ల వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఒకవేళ, హార్ట్​ స్టోక్​ వస్తే సకాలంలో చికిత్స చేయించుకోవాలి. ఒక్క సారి హార్ట్ స్ట్రోక్​కు గురైతే మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించడం చాలా కష్టం. అందువల్ల, గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం.


* తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా యువతలో మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ కారణంగా వారు హార్ట్​ స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. హార్ట్ స్టోక్ సమస్య ఉన్న వారు దాని నుంచి బయటపడాలంటే వారి కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. అయితే, చాలా మందికి స్ట్రోక్​ రాగానే నిరాశలోకి కూరుకుపోతారు. అటువంటి సమయంలో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవడం చాలా అవసరం. ఇది వారిలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. తద్వారా హార్ట్​ స్ట్రోక్​ నుంచి త్వరగా కోలుకోగలరు.


హార్ట్​ స్ట్రోక్​ సమస్యను తగ్గించడానికి జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి చక్కని సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్​ డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. ఉప్పు, ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించండి. ధూమపానం మానేయాలి రోజూ వ్యాయామం చేయాలి. ఇవి మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

No comments

Powered by Blogger.