Latest

Loading...

IBPS RRB Jobs 2021: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే...!

IBPS RRB Jobs


 1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్.

2. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్.
హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, వరంగల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్, గుంటూరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయి

3. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. 2021 జూన్ 28 లోగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

4. మొత్తం 10,676 ఖాళీల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- 5305, ఆఫీసర్ స్కేల్ 1- 4119, ఆఫీసర్ స్కేల్ 2 (అగ్రికల్చర్ ఆఫీసర్)- 25, ఆఫీసర్ స్కేల్ 2 (మార్కెటింగ్ ఆఫీసర్)- 43, ఆఫీసర్ స్కేల్ 2 (ట్రెజరీ మేనేజర్)- 9, ఆఫీసర్ స్కేల్ 2 (లా)- 27, ఆఫీసర్ స్కేల్ 2 (సీఏ)- 32, ఆఫీసర్ స్కేల్ 2 (ఐటీ)- 59, ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 906, ఆఫీసర్ స్కేల్ 3 - 151 పోస్టులున్నాయి.

5. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు చూస్తే గుంటూరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్- 156, ఆఫీసర్ స్కేల్ 1- 60, ఆఫీసర్ స్కేల్ 2- 31 పోస్టులున్నాయి. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్- 134, ఆఫీసర్ స్కేల్ 1- 21, ఆఫీసర్ స్కేల్ 3- 4 పోస్టులున్నాయి

6. తెలంగాణలోని వరంగల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్- 225, ఆఫీసర్ స్కేల్ 1- 50, ఆఫీసర్ స్కేల్ 2- 10 పోస్టులున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్- 120, ఆఫీసర్ స్కేల్ 1- 36, ఆఫీసర్ స్కేల్ 2- 12 పోస్టులున్నాయి.

7. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 20 రోజులు మాత్రమే అవకాశం ఉంది. డిగ్రీ, ఎంబీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు


No comments

Powered by Blogger.