Latest

Loading...

Immunity ఇమ్యునిటీ తగ్గిందని ఎలా తెలుసుకోవాలంటే.....?

Immunity

 కరోనా మహమ్మారిని ఎదురుకోవాలంటే ముందుగా ఉండాల్సిందని ఇమ్యునిటీ అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. దాంతో గతేడాది నుండి ఎక్కడ చూసినా ఇమ్యునిటీ అనే పేరే భాగా వినిపిస్తుంది. దాంతో అంతా తమ ఇమ్యునిటీని పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే కాకుండా కరోనాకు భయపడి కొందరు తమ ఇమ్యునిటీని పెంచుకునేందుకు ట్యాబ్లెట్లు వాడటం కూడా మొదలు పెట్టారు. అయితే అనవసరంగా టాబ్లెట్ వాడటం వల్ల ఇమ్యునిటీ పెరగటం ఏమోగానీ ఇతర అనర్థాలకు దారి తీయోచ్చని నిపుణులు హెచ్చరించారు. దాంతో టాబ్లెట్లను పక్కన పడేసారు. అసలు ఇమ్యునిటీ అంటే ఏంటి అది మన శరీరంలో తగ్గిందని ఎలా గుర్తించాలి..ఒకవేళ తక్కువ ఇమ్యునిటీ ఉంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఇమ్యునిటీ అంటే రోగనిరోధక శక్తి ఇది ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఇది ఉంటుంది. కాకపోతే కొందరిలో ఎక్కువ ఇమ్యునిటీ ఉంటే మరికొందరిలో తక్కువ ఇమ్యునిటీ ఉంటుంది. అయితే ఇమ్యునిటీ తక్కువ ఉన్నవారు తరచూ అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. వాతావరణంలో మార్పులు వచ్చినా.లేదంటే ఏదైనా కలుషిత నీరు, ఆహారం తిన్నా అనారోగ్యానికి గురవడం జరుతుంది. ముఖ్యంగా ఇతరుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురవ్వడం.ఎలర్జీలకు కూడా తట్టకోలేకపోకుండా ఉంటే ఇమ్యునిటీ తక్కువగా ఉందని గ్రహించాలి. అయితే ఇమ్యునిటీని పెంచుకోవడాని ముందుగా హోం రెమిడీస్ నే ఉపయోగించాలి. దానివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్ లు రాకుండా ఇమ్యునిటీని పెంచుకోవచ్చు.


ఇప్పుడు నాచురల్ గా ఇమ్యునిటీనీ పెంచే ఆహారాలు ఏవో చూద్దాం..సిట్రస్ పండ్లు ఇమ్యునిటీ బూస్టర్ లుగా పనిచేస్తాయి. అందులో ఉండే విటమిన్- సీ ఇమ్యునిటీ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పసుపు ను పాలల్లో కలుపుకుని ప్రతి రోజూ తాగటం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. వెల్లుల్లి కూడా ఇమ్యునిటీ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ సెల్స్ ను పెంచి ఇమ్యునిటీ పెంచుతుంది. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం కూడా ఇమ్యునిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది.

No comments

Powered by Blogger.