Jobs పది అర్హతతో 1388 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు...మంచి వేతనంతో...!
మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 1388 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎండీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుండటం గమనార్హం. చిప్పర్ గ్రైండర్, కాంపోసిట్ వెల్డర్, జూనియర్ డ్రాట్స్‌మ్యాన్, ఫిట్టర్, ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజైంది.
అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 4వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://mazagondock.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా 10వ తరగతి చదివి సంబంధిత అంశంలో సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతీపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏ సందేహం ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి విభాగాల వారీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
No comments