Latest

Loading...

Jobs: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 14 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి...!

Jobs


ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మంట్ కార్పొరేషన్ - APSSDC నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో సంస్థలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. Quesscorp Limited సంస్థలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలిఫోనిక్ రౌండ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-32 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం చెల్లించున్నారు.

No comments

Powered by Blogger.